ఇటీవ‌ల `అల వైకుంఠ‌పుర‌ములో` సినిమాతో సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్‌.. ప్ర‌స్తుతం క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` టైటిల్‌తో ఓ సినిమా ప‌ట్టాలెక్కించిన సంగ‌తి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తోంది. తెలుగులో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నారు. ఇక ఇటీవ‌ల ఈ సినిమా మొదటి లుక్ తో పాటు టైటిల్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేస్తే సోషల్ మీడియాలో ట్రేండింగ్ గా మారింది. 

IHG

ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బ‌న్నీ పుష్క సినిమా.. ప్ర‌భాస్ సాహోను ఫాలో అవుతున్న‌ట్టు తెలుస్తోంది. సాహో సినిమాను ఒక పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ సినిమాగా మలిచేందుకు చాలా కష్టబడ్డారు. ఈ క్ర‌మంలోనే సాహో కోసం బాలీవుడ్ షేడ్స్ ఎక్కువగానే తీసుకున్నారు. అందులో భాగంగానే ఒక స్పెషల్ సాంగ్ కు బాలీవుడ్ బ్యూటి జాక్వలిన్ ఫెర్నాండెజ్ ను ఎంచుకున్నారు.

IHG

అయితే ఇప్పుడు పుష్ప టీం కూడా ఇదే బాటలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాలోని ఒక స్పెషల్ ఐటెం సాంగ్ కోసం ఒక టాప్ బాలీవుడ్ నటినే తీసుకోనున్న‌ట్టు తెలుస్తోంది. నిజానికి  కథ కథనం గురించి పక్కన పెడితే సుక్కు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇప్ప‌టికే ఈ పాట కోసం దేవిశ్రీ‌ప్ర‌సాద్‌ ట్యూన్‌ని కూడా రెడీ చేశార‌ని, సినిమాకు ఈ పాట స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలుస్తుంద‌ని తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ స్టాయిని అందుకునేందుకు సుకుమార్ పుష్ప‌ ఐటెం సాంగ్‌ కోసం స్పెష‌ల్‌ కేర్ తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: