టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో స్టార్ హీరో అయిపోయాడు నానీ. నానీ సినిమాలు అనగానే అభిమానుల్లో ఒక క్రేజ్ ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు అతని సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అనేది వాస్తవం. అయితే నానీ క్రేజ్ కొంత కాలంగా తగ్గుతూ వస్తుంది. ఆయన తో సినిమా చేయడానికి ఎవరూ కూడా ముందుకు వచ్చే పరిస్థితి ప్పుడు లేదు అనే విషయం అర్ధమవుతుంది. నానీ సినిమా చేస్తా అన్నా సరే ఆయన తో సినిమా చేయడానికి మాత్రం ఎవరూ కూడా ఆసక్తి చూపించడం లేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

ఇప్పుడు నానీ జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయితే మాత్రం తాను బాగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. టాలీవుడ్ జనాలు కూడా నానీ తో సినిమా చేసే విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. నానీ సినిమా హిట్ అయి దాదాపు ఏడాది దాటిన సంగతి తెలిసిందే. ఏ హీరో కూడా ఇంత ఇబ్బంది పడటం లేదు ప్రస్తుత పరిస్థితుల్లో. చిన్న చిన్న ధర్శకులతో ఇప్పటి వరకు సినిమాలు చేసిన నానీ ఇప్పుడు పెద్ద దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచార౦. 

 

పెద్ద దర్శకులతో సినిమా చేయడానికి గానూ అతను చర్చలు జరుపుతున్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఎవరూ కూడా ముందుకు వచ్చి అతని తో సినిమా చేస్తాం అనే పరిస్థితి లేదు అంటున్నారు ఈ తరుణంలోనే ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలి అనుకున్న త్రివిక్రమ్ ని గ్యాప్ దొరికితే తన తో సినిమా చెయ్యాలి అని కోరినట్టు సమాచారం. తాను నిర్మాతగా వ్యవహరిస్తాను అని కూడా నానీ త్రివిక్రమ్ ని కోరినట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన కూడా అందుకు ఓకే చెప్పాడు అని టాలీవుడ్ వర్గాల్లో టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: