బాలయ్య తీరు చూస్తే అందరికీ డౌట్ ఉంటుంది. ఆయన తనకంటూ ఒక సిస్టం పెట్టుకుని అందులోనే ఉంటారని అంటారు. అది చాలా సందర్భాల్లో నిజం కూడా అని చెబుతారు. ఆయన ఒక గ్రూప్ ఆఫ్ టెక్నీషిన్లతో పనిచేయడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు.

 

దాంతో బాలయ్య ఎక్కువగా హిట్లు ఇవ్వలేకపోయారని అంటారు. ముఖ్యంగా బాలయ్య యంగ్ టాలెంట్ విషయంలో పనిచేయడానికి సందేహిస్తారని అంటారు. ఆయన ఎక్కువగా సీనియర్ డైరెక్టర్లు, ప్రూవ్ చేసుకున్న వారితోనే సినిమాలు చేస్తారు.

 

ఇక మరో విషయం తీసుకుంటే బాలయ్య తన మైండ్ సెట్ తో మాచ్ అయిన వారితోనే ఉంటారు. వారితోనే పనిచేస్తారు. ఆయనకు ఎన‌‌భైలు, తొంబయిలలో అలా కుదిరింది కానీ ఇపుడు అది కష్టం. ఎందుకంటే ఆయన ఎంచుకున్న సీనియర్లు అందరూ ఇపుడు మెగా ఫోన్ వదిలేశారు. ఇక బోయపాటి శ్రీను లాంటి వారితో సినిమాలు తీస్తున్న బాలయ్య ఆయన్ని దాటి ముందుకు రావడంలేదని కామెంట్ ఉంది.

 

దానికి చెక్ చెబుతూ బాలయ్య అనిల్ రావిపూడికి తాజాగా కబురు పెట్టారట. అనిల్ రావిపూడితో పనిచేసేందుకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అనిల్ రావిపూడి కొత్త మూవీ ఎఫ్ 3 పనుల్లో ఇపుడు ఉన్నాడు. ఆ తరువాత మహేష్ బాబు తో మూవీ అనుకుంటున్నాడు. అయితే అనిల్ రావిపూడి తొలి సినిమా తీసింది నందమూరి హీరో కళ్యాణ్ రాం తోనే. ఆయన బాలయ్యకు వీరాభిమాని

 

అందువల్ల బాలయ్యతో సినిమా చేసేందుకు ఆయన గతం నుంచే  ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. అప్పట్లో రామారావు అన్న మూవీ తీయాలని  ఆయన టైటిల్ కూడా పెట్టుకుని బాలయ్యబాబుకు కధ వినిపించాడని అంటున్నారు. అయితే బాలయ్య ఎందుకో చాన్స్ ఇవ్వలేదు. ఇపుడు టాప్ డైరెక్టర్లలో ఒకడిగా అనిల్ రావిపూడి ఉన్నాడు.

 

దాంతో ఆయనతో సినిమా చేయడానికి బాలయ్య ఓకే చెప్పాడుట. ఇక ఈ ఇద్దరు కాంబోలో రామారావు మూవీ వస్తుందని అంతా అనుకుంటున్నారు. ఈ మూవీ బాలయ్య స్టైల్ కి చాలా సెట్ అయ్యే సినిమా అంటున్నారు. సో బాలయ్యకు భారీ హిట్ అనిల్ రావిపూడి ఇస్తాడని ఫ్యాన్స్ కూడా నమ్ముతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: