త్రివిక్రమ్ శ్రీనివాస్, జూనియర్ ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్ గురించి రోజుకో న్యూస్ వస్తోంది. బాలీవుడ్ బ్యూటీని కాంటాక్ట్ చేశారని కొన్నాళ్లు, తమిళ అమ్మాయిని సెలక్ట్ చేశారని మరికొన్నాళ్లు వార్తలు వచ్చాయి. అంతకుముందు  బుట్టబొమ్మని ఫిక్స్ చేశారనే టాక్ వచ్చింది. అసలు ఈ మూవీకి త్రివిక్రమ్ ఎంతమంది హీరోయిన్లను తీసుకుంటున్నాడు. పంచ్ మాస్టర్ మైండ్ లో ఉన్న ఆ లేడీ ఎవరో తెలుసా.. 


త్రివిక్రమ్ శ్రీనివాస్-జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కు ఇంకా లాంచింగ్ డేట్ ఫిక్స్ కాలేదు. సినిమా ఏ బ్యాక్ డ్రాప్ లో వస్తుందో క్లారిటీ లేదు. కానీ ఈ మూవీలో హీరోయిన్ గురించి మాత్రం రకరకాల వార్తలు వస్తున్నాయి. శృతిహాసన్ ని తీసుకుంటున్నారని ఒకసారి, జాన్వీ కపూర్ ను కాంటాక్ట్ చేశారని ఇంకోసారి, పూజా హెగ్డే కన్ఫార్మ్ అయిందని మరోసారి ఇలా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. మరి తారక్ జోడీగా త్రివిక్రమ్ ఎవరిని తీసుకుంటున్నాడు. 


త్రివిక్రమ్ శ్రీనివాస్ హీరోలు, హీరోయిన్ల విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటాడు. వేవ్ లెంగ్త్ మ్యాచ్ అయిన వాళ్లతోనే వర్క్ చేస్తుంటాడు. హీరోలను ఎలా రిపీట్ చేస్తుంటాడో హీరోయిన్లను అలాగే రిపీట్ చేస్తాడు. జల్సా, జులాయి సినిమాలకు ఇలాగే ఇలియానాను తీసుకున్నాడు. సమంతతో సన్నాఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది, ఆఆ చేశాడు. అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలకు పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నాడు. 

 

త్రివిక్రమ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ మెంట్ వచ్చాక పూజా హెగ్డే హీరోయిన్ గా పైనల్ అయ్యిందనే టాక్ వచ్చింది. తర్వాత సెకండ్ హీరోయిన్ కోసం వెతుకుతున్నారనే ప్రచారం జరిగింది. మరి ఈ ప్రాజెక్ట్ లో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారా.. లేక ఒక్కరికే ఛాన్స్ ఉందా అనేది క్లారిటీ లేదు గానీ.. ఇండస్ట్రీ జనాలు మాత్రం రోజుకో పేరుని తెరపైకి తెస్తున్నారు. మరి ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అనేది తేలాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: