టాలీవుడ్ విజయ్ దేవరకొండ కు ఉన్న  క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమకు పరిచయమైన విజయ్ దేవరకొండ అంచలంచలుగా ఎదుగుతూ ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. కేవలం హీరోగానే కాకుండా తన ఆలోచనతో  కూడా యూత్ ఐకాన్ గా మారిపోతున్నాడు విజయ్ దేవరకొండ. తెలంగాణ లో  కరోనా  వైరస్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు చేయూతనిచ్చి అండగా నిలిచారు విజయ్ దేవరకొండ. తను ఒక రీల్ లైఫ్ హీరో మాత్రమే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో అని నిరూపించుకున్నారు. 

 


 పోలీసులతో ఇంటరాక్షన్ కావడం, వారికి జ్యూస్ అందించడం లాంటివి చేయడమే కాకుండా దేవరకొండ ఫౌండేషన్ ద్వారా విరాళాలు సేకరించి... అవసరం ఉన్నవారికి చేయూతనిచ్చే విధంగా చర్యలు చేపట్టడం... తన ఫౌండేషన్ ద్వారా వారధిగా  ఏర్పడటం లాంటివి చేస్తూ కరోనా  పోరాటంలో భాగంగా తనదైన భాగస్వామ్యాన్ని పోషించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రజలకు విజ్ఞప్తి చేయడం.  వైరస్ నుంచి దూరంగా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉండటం లాంటివి చేశారు విజయ్ దేవరకొండ. అయితే సినిమాలలో తన అట్టిట్యూడ్  తో తన యాక్టింగ్ తో యూత్ ఐకాన్ గా మారిపోయారు విజయ్ దేవరకొండ.

 


 ఇప్పుడు కరోనా  లాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్న సమయంలో... ఒక బాధ్యతగల పౌరుడిగా... రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు చేయూతనిచ్చి సహనం అందించేందుకు ముందుకొచ్చారు. ప్రస్తుతం ఏ యువ  హీరో చేయని విధంగా విజయ్ దేవరకొండ చేసి  అభిమానుల మనసులు దోచుకున్నాడు  అని చెప్పాలి. అయితే కరోనా పై  పోరాటంలో విజయ్ దేవరకొండ ది దేవరకొండ ఫౌండేషన్ ద్వారా మిడిల్ క్లాస్ ఫండ్ అంటూ స్టార్ట్  చేసి ఎంతో  మందికి చేయూతనిచ్చిన రౌడీ హీరో యూత్ ఐకాన్ ఆఫ్ ది మంత్ గా  నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: