కరోనా కల్లోలం దేశ్ ప్రజల్లో రేపిన అలజడి అంతా ఇంతా కాదు. ఏరోజు ఏం జరుగుతుందో అనే ఆందోళనలో ప్రజలు ఉన్నారు. ఉపాధి కోల్పోయి కొందరు, దూర ప్రాంతాల్లో ఇరుక్కుపోయి మరికొందరు ఉన్నారు. వ్యవస్థలన్నీ నిస్తేజమైపోయాయి. ఇందులో సినీ పరిశ్రమ కూడా ఉంది. ఈ సంక్షోభం ధాటికి సినీ పరిశ్రమపైనే ఆధారపడ్డ కుటుంబాలు ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని ఆదిలోనే గుర్తించిన చిరంజీవి ‘సీసీసీ మన కోసం’ అనే చారిటీని ఏర్పాటు చేసి ఇతర సెలబ్రిటీలతో కలిసి వారి కుటుంబాలకు నిత్యావసరాలు అందిస్తున్నారు.

 

 

అయితే ఇవన్నీ గుర్తింపు కార్డులున్న కార్మికులకు మాత్రమే నిత్యావసరాలు అందాయి. అయితే.. గుర్తింపు కార్డులు లేని కార్మికులకు సాయం చేయడానికి ముందుకు వచ్చింది జార్జిరెడ్డి సినిమా టీమ్. దీంతో ఈ నెల 5వ తేదీన జార్జిరెడ్డి టీమ్ అంతా కలిసి గుర్తింపు కార్డులు లేని వందకు పైగా కుటుంబాలను ఆదుకున్నారు. టీమ్ అంతా కలిసి ఆ కుటుంబాలకు పది రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు అందించారు. ఈ సాయంలో భాగంగా బియ్యం, ఉల్లిపాయలు, కందిపప్పు, నూనె అందించారు. ఈ కార్యక్రమంలో హీరో శాండీ, నిర్మాత అన్నపురెడ్డి అప్పిరెడ్డి, దాము రెడ్డి, దర్శకుడు జీవర్ రెడ్డి, ఇతర నటీనటులు అంతా పాల్గొన్నారు.

 

 

వీరు తీసుకున్న నిర్ణయం పరిశ్రమలో మంచి గుర్తింపును తీసుకొచ్చింది. లాక్ డౌన్ తో ఈ కార్మికులు అంతా షూటింగ్స్ లేక పనులను కోల్పోయారు. ఇలా చిరంజీవితో సహా సినీ పరిశ్రమ మొత్తం అంతా కలిసి రావటం ప్రజల్లో ఎంతో పేరు తీసుకొచ్చింది. వేలల్లో ఉన్న కార్మికులు వీరు అందించిన సాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ మహమ్మారి తీవ్రత పెరగకుండా ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రజలకు అన్ని రకాలుగా సాయం అందించి ఆదుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: