తెలుగులో స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు తీసిన ప్రొడక్షన్ హౌజ్ అది.. పెద్ద పెద్ద స్టార్స్ తో సినిమాలు తీస్తూ సూపర్ హిట్లు కొట్టిన ఈ బ్యానర్ ఇప్పుడు వరుస ప్లాపులు తీస్తుంది. ఓ పక్క పెద్ద హీరోలతో చేస్తూనే మరోపక్క యువ హీరోలతో సినిమా చేశారు. అయిదు స్టార్స్ తో కనీసం వసూళ్లయినా వచ్చేవి కానీ యువ హీరోల సినిమాలు వాళ్లకు భారీ లాసులు తెచ్చాయట. లాస్ట్ ఇయర్ ఒక యువ హీరో సినిమాకు భారీగా ఖర్చు పెట్టడంతో ఆ సినిమా కాస్త తుస్సుమన్నది. అప్పటినుండి ఆ బ్యానర్ లో నిర్మాతల మధ్య గొడవలు మొదలయ్యాయట. 

 

ప్రస్తుతం ఒక క్రేజీ కాంబినేషన్ సెట్ చేసిన ఆ బ్యానర్ ఆ ఒక్క సినిమాతో తన ప్రొడక్షన్ హౌజ్ ఆపేయాలని చూస్తున్నారట. అయితే ముగ్గురు కలిసి నిర్మాతలుగా కొనసాగే ఈ బ్యానర్ నుండి ఇప్పటికే ఒకరు పక్కకు తప్పుకోగా మిగిలిన ఇద్దరు ప్రస్తుతం సినిమాలు నిర్మిస్తున్నారట. అయితే సినిమాలు నిర్మించడం మానేసి సినిమాలకు ఫైనాన్స్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. బిజినెస్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన వారు కాబట్టి వారు ఇలా ఆలోచించడంలో తప్పేమి లేదు. 

 

అయితే ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే చాలు సినిమా నిర్మాత అయినట్టే అనుకుంటారు కానీ ఎంత పెద్ద ప్రొడక్షన్ హౌజ్ అయినా సరే డబ్బులు ఉన్నా కొన్ని కారణాల వల్ల సినిమాలు తీయడంలో వెనుకపడతారు. మరి ఈ టాలీవుడ్ క్రేజీ బ్యానర్ పై వస్తున్నా ఈ వార్తల్లో ఏది నిజం అన్నది తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.  ఒకవేళ ఆ ప్రొడక్షన్ హౌజ్ మూసేయడం నిజమైతే మిగతా నిర్మాతలకు పెద్ద షాక్ అన్నట్టే.            

మరింత సమాచారం తెలుసుకోండి: