ఆర్.ఆర్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. హారిక హాసిని, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కలిసి ఈ మూవీ నిర్మిస్తారట. అల వైకుంఠపురములో సక్సెస్ తర్వాత త్రివిక్రమ్ మరోసారి ఎన్టీఆర్ తో వర్క్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇద్దరు కలిసి ఇదివరకు అరవింద సమేత సినిమా చేశారు. ఇప్పుడు మరోసారి వాళ్ళిద్దరు కలిసి మ్యాజిక్ చేయబోతున్నారు. ఈ మూవీకి టైటిల్ గా అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ పరిశీలనలో ఉంది. 

 

మూవీ కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రాసుకున్నాడట త్రివిక్రమ్. సినిమాలో ఎన్టీఆర్ కు సపోర్ట్ గా ఫ్రెండ్ పాత్రలో కమెడియన్ సునీల్ కు మంచి పాత్ర రాస్తున్నాడట త్రివిక్రమ్. హీరోగా రకరకాల ప్రయత్నాలు చేసి మళ్ళీ కమెడియన్ గా కొనసాగడమే కరెక్ట్ అనుకుని కామెడీ పాత్రలు చేస్తున్నాడు సునీల్. అరవింద సామెత, చిత్రలహరి, అల వైకుంఠపురములో ఇప్పుడు వరుసగా కమెడియన్ గా చిన్న పాత్రలైనా సరే చేసుకుంటూ వస్తున్న సునీల్ ఎన్టీఆర్ 30వ సినిమాలో కూడా అదిరిపోయే రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. అల వైకుంఠపురములో సునీల్ పాత్ర ఉన్నా పెద్దగా ప్రాముఖ్యత ఉన్నట్టు అనిపించదు. 

 

అయితే ఈసారి ఎన్టీఆర్ సినిమాలో మాత్రం సునీల్ ను బాగా వాడేందుకు సిద్ధమయ్యాడట త్రివిక్రమ్. ఇక ఆయన ఫిక్స్ అయ్యాడు అంటే మళ్ళీ సునీల్ ఫామ్ లోకి వచ్చేసినట్టే లెక్క. మళ్ళీ హీరోగా చేయాలనే ఆలోచన మానుకున్న సునీల్ ఇక మీదట ఎలాంటి రిస్క్ చేయకూడదని అనుకుంటున్నాడట. మరి ఎన్టీఆర్ 30వ సినిమా సునీల్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేస్తుందో లేదో చూడాలి. సునీల్ మాత్రం ఎలాంటి ఛాన్స్ వచ్చినా సరే చేసేందుకు రెడీ అంటున్నాడు.               
 

మరింత సమాచారం తెలుసుకోండి: