కరోనా సమస్యలు రాకుండా ఉండి ఉంటే మే 20న రాబోతున్న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజునాడు ‘ఆర్ ఆర్ ఆర్’ లో తారక్ పాత్రకు సంబంధించిన కొమరం భీమ్ టీజర్ విడుదల అయి ఉండేది. అయితే లాక్ డౌన్ తో ఎక్కడ పనులు అక్కడ ఆగిపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన టీజర్ ను రాజమౌళి విడుదల చేయడం కష్టం అన్న సంకేతాలు వస్తున్నాయి. 

 

లాక్ డౌన్ మరికొన్ని వారాలు పొడిగింపబడే ఆస్కారం ఉన్న నేపధ్యంలో జూనియర్ పుట్టినరోజునాడు ఎటువంటి హంగామా ఉండదా అంటూ బాధ పడిపోతున్న అభిమానులకు త్రివిక్రమ్ రంగంలోకి దిగి ఊహించని విధంగా వారికి జోష్ ను ఇవ్వబోతున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు జూనియర్ పుట్టినరోజునాడు త్రివిక్రమ్ తారక్ ల కాంబినేషన్ లో ప్రారంభం కాబోయే మూవీ టైటిల్ పోష్టర్ విడుదల అవుతుంది అని లీక్ లు వస్తున్నాయి. 

 

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి త్రివిక్రమ్ ఆలోచనలలో ఉన్న టైటిల్ ‘అవును పోయిరావలె హస్తనకు’ జూనియర్ కూడ ఒకే చెప్పడంతో ఈ టైటిల్ ను అధికారికంగా మే 20న ప్రకటించడానికి ప్రస్తుతం టైటిల్ డిజైన్ వర్క్ జరుగుతున్నట్లు టాక్. అంతేకాదు ఈ మూవీలో జూనియర్ లుక్ ఎలా ఉండబోతుందో రేఖా మాత్రంగా ఈ టైటిల్ పోష్టర్ లో చూపెట్టబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. 

 

ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి పూర్తి అయిన టోటల్ స్క్రిప్ట్ ను చదివిన జూనియర్ ఆ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చెప్పడంతో ఆ మార్పులు చేసే పనిలో త్రివిక్రమ్ టీమ్ ప్రస్తుతం ఈ లాక్ డౌన్ టైమ్ లో బిజీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ గా మరొకసారి పూజ హెగ్డే ని ఎంపిక చేయాలి అని త్రివిక్రమ్ భావిస్తుంటే జూనియర్ మాత్రం రష్మిక వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి సంబంధించి ఎటువంటి హడావిడి తారక్ పుట్టినరోజునాడు లేకపోయినా ఆలోటును త్రివిక్రమ్ చాల తెలివిగా కవర్ చేస్తున్నాడు అనుకోవాలి..    

 

మరింత సమాచారం తెలుసుకోండి: