‘మహర్షి’ సినిమా తరువాత మహేష్ వంశీ పైడిపల్లి ల మధ్య సాన్నిహిత్యం విపరీతంగా పెరిగిపోవడంతో వీరిద్దరి కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు వస్తాయన్న సంకేతాలు ఓపెన్ గానే వచ్చాయి. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదల తరువాత అమెరికాకు వెళ్ళిన మహేష్ తిరిగివచ్చిన వెంటనే వంశీ పైడిపల్లి చెప్పిన కథవిని ఆకథ తనకు నచ్చలేదు అని చెప్పడమే కాకుండా వెనువెంటనే పరుశు రామ్ కథకు ఓకె చెప్పడంతో బయటకు చెప్పుకోలేక పోయినా ఈవిషయాన్ని వంశీ పైడిపల్లి చాల అవమానంగా ఫీల్ అయ్యాడు అని వార్తలు వచ్చాయి. 

 

అయితే అనుకున్న సినిమా ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినా మహేష్ తో తన సాన్నిహిత్యం కొనసాగుతూనే ఉంటుంది అంటూ వంశీ పైడిపల్లి అనేకసార్లు ఓపెన్ గా చెపుతూ తనకు మహేష్ కాంపౌండ్ లో ఎటువంటి నిరాశా ఎదురుకాలేదు అన్నట్లుగా తన పరిస్థితులను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న పరిస్థితులలో టాప్ హీరోలు ఎవర్ని బుట్టలో పెట్టడానికి ఆస్కారం లేకపోయినా తనకు ‘బృందావనం’ మూవీ నుండి జూనియర్ ఎన్టీఆర్ తో కొనసాగుతున్న సాన్నిహిత్యంతో ఈమధ్య జూనియర్ ను తనకు ఒక అవకాశం ఇవ్వవలసిందిగా కోరినట్లు టాక్. 

 

అంతేకాదు జూనియర్ అంగీకరిస్తే తాను ఈలాక్ డౌన్ సమయంలో తన టీమ్ తో కలిసి ‘బృందావనం’ మూవీకి సీక్వెల్ కథ తయారు చేస్తాను అని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈసూచన జూనియర్ కు నచ్చడంతో ‘బృందావనం’ సీక్వెల్ కు కథను రెడీ పెట్టమని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది దీనితో రెట్టించిన ఉత్సాహంతో సుకుమార్ ప్రస్తుతం ఈలాక్ డౌన్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ను దృష్టిలో పెట్టుకుని 
‘బృందావనం’ సీక్వెల్ కథ పై ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

 


అయితే వాస్తవానికి ప్రస్తుతం జూనియర్ నటిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ పూర్తి అయిన వెంటనే త్రివిక్రమ్ మూవీని పట్టాలు ఎక్కించే ఆలోచనలలో జూనియర్ ఉన్నాడు. ఆసినిమా పూర్తయిన తరువాత  జూనియర్ అట్లీ దర్శకత్వంలో కానీ కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ తో కానీ ఒక సినిమా జూనియర్ చేస్తాడు వార్తలు వస్తున్నాయి. దీనితో జూనియర్ ఈ సినిమాలు అన్నీ పూర్తి చేయడానికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది. ఇలాంటి పరిస్థితులలో వంశీ పైడిపల్లి కష్టపడి రాస్తున్న ‘బృందావనం’ సీక్వెల్ కు జూనియర్ డేట్స్ ఎక్కడ ఇవ్వగలడు అంటూ మరికొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. అయితే మరికొందరైతే జూనియర్ కు వంశీ పైడిపల్లి అంటే ప్రత్యేకమైన గౌరవం ఉందని అందువల్లన మహేష్ చివరి నిముషంలో వంశీ పైడిపల్లికి హ్యాండ్ ఇచ్చినట్లుగా తారక్ ప్రవర్తించాడు అంటూ వంశీ పైడిపల్లి ప్రస్తుత పరిస్థితికి పరిష్కారం ఒక్క జూనియర్ మాత్రమే చూపించగలడు అంటూ ఊహాగానాలు చేస్తున్నారు..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: