కరోనా వైరస్ ని ఎదుర్కోవడం అంటే కేవలం ప్రభుత్వాలకు మాత్రమే సాధ్యం అయ్యే పని కాదు అనే విషయం అందరికి తెలిసిందే. ఎవరి సాయం వాళ్ళు చేస్తేనే కరోనా నుంచి మనం బయటకు వస్తాం. రాజకీయాలను అన్నింటిని పక్కన పెట్టి ఎవరికి వారు గా ముందు కు వచ్చి సహాయం చేస్తే కరోనా ను ఎదుర్కోవడం అనేది ప్రభుత్వాలకు సాధ్యం అవుతుంది. ఇలా ఎవరికి వారుగా ముందుకు వచ్చిన రోజున ప్రజలకు కూడా తాము ఏదో ప్రమాదంలో ఉన్నాం అనే ఆలోచన కూడా దాదాపుగా పోయే అవకాశం ఉంటుంది. అందుకే మన తెలుగు నుంచి హింది వరకు నటులు సహాయాలు చేసారు. 

 

ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం లో రీల్ హీరోస్ మాత్రమే కాదు రియల్ హీరోస్ అని కూడా అనిపించుకున్నారు. ఇందులో ప్రధానంగా చెప్పుకునేది బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ కుమార్. ఆయన ఏదోక సాయం ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ఇక కరోనా లాక్ డౌన్ లో కూడా తన వంతుగా సహాయ౦ చేసారు. ముందు 25 కోట్ల రూపాయలను ఆయన సహాయం చేయగా తర్వాత మరో మూడు కోట్లు తర్వాత ముంబై పోలీసులకు రెండు కోట్లు ఆయన సహాయం చేసారు. ఆ తర్వాత ఆ స్థాయిలో ఏ హీరో కూడా సహాయం చేయలేదు. ఇక బాలీవుడ్ అగ్ర నటులు అందరూ కూడా సినిమాలు  లేక ఖాళీ గా ఉండే వారి కోసం సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. 

 

ఇక మన తెలుగులో పవన్ కళ్యాణ్ రెండు కోట్ల భారీ విరాళం ఇచ్చారు. ఆయన స్థాయికి తగిన విధంగా ఈ విరాళం ఇచ్చారు. ఇక ప్రభాస్ బాలకృష్ణ, నాగార్జున ఇలా అందరూ కూడా తమకు చేతనైన సాయ౦ చేసి  కరోనా ను ఎదుర్కోవడంలో ప్రజలకు సహాయం చేస్తూ వస్తున్నారు. ఎంత అవసరం అయినా మేము ఇస్తాం అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: