ఏప్రిల్ నెలలో హీరో ఆఫ్ ది మంత్ గా మెగాస్టార్ చిరంజీవి నిలిచారు. లాస్ట్ మంత్ 25 న సోషల్ అయినా చిరంజీవి తన  ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. ఈ మంత్ మొదట్లో నందమూరి బాలకృష్ణ సీసీసీకి ఇచ్చిన పాతిక లక్షల చెక్ ను ట్విట్టర్ లో పెట్టిన చిరు, ప్రతి కష్ట సమయంలో ప్రజలను ఆదుకునేందుకు సినీ పరిశ్రమ ముందుకొస్తే మీరు ఎప్పుడు తోడుంటారు థాంక్స్ డియర్ బ్రదర్ అని ట్వీట్ చేశారు. కరోనా వైరస్ పట్ల సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన కలిగించేలా కోటి సంగీత సారధ్యంలో ఒక సాంగ్ లో కన్పించారు చిరు, నాగ్, సాయి తేజ్, వరుణ్ తేజ్. వీళ్లంతా తమ ఇళ్లలో ఉంటూ తమ సెల్ ఫోన్ తో ఆ పాటలో కనిపించారు. దీనికి దేశ ప్రధాని మోడీ దగ్గర నుండి కూడా ప్రశంసలు అందుకున్నారు. 

 

ఇక తారక్ ఇచ్చిన బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ ను కూడా స్వీకరించిన మెగాస్టార్.. వంట గదిలో వేసిన ఆ ఉప్మా దోశకి చాలామంది ఫ్యాన్స్ అయ్యారు. కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న సినీ కార్మికుల సహాయార్ధం వసూలు చేసిన మొత్తాన్ని కూడా సంబంధిత కార్యక్రమాలను చేపట్టి వాళ్లకు కావాల్సిన నిత్యావసరాలను అందేలా చూశారు చిరంజీవి. సోషల్ మీడియా వల్ల చిరు ఇంట్లో ఏం చేస్తున్నాడు అన్నది చూసే అవకాశం దక్కిందని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. 

 

మెగా ఫ్యాన్స్ అయితే చిరు ప్రతి అప్డేట్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పొచ్చు.. ఇంట్లో తన మానవరాలితో ఆడుతూ చిరు షేర్ చేసిన వీడియో కూడా మెగా ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేసింది. సరైన టైం లో సరైన విధంగా ప్రేక్షకులకు, ప్రజలకు కరోనా పట్ల అవగాహన కల్పిస్తూ.. ఈ లాక్ డౌన్ టైం లో ఎంటర్టైన్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి హీరో ఆఫ్ ద మంత్ గా నిలిచారు. మిగతా హీరోలు కూడా యాక్టివ్ గానే ఉంటున్నా చిరు మాత్రం వాళ్ల అందరికన్నా ముందు ఉన్నాడని చెప్పొచ్చు. ప్రస్తుతం చిరు కొరటాల శివ డైరక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్నాడు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: