లాక్ డౌన్ పిరియడ్ కొనసాగుతున్న పరిస్థితులలో అనేక ప్రముఖ మీడియా సంస్థలు ఛానల్స్ ప్రముఖ సెలెబ్రెటీ లతో ఆన్ లైన్ ఇంటర్వ్యూలు చేస్తూ తెగ సందడి చేస్తున్నాయి. ఈ విషయాలలో మెగా స్టార్ చిరంజీవి తనకు వచ్చిన లాక్ డౌన్ సమయాన్ని బాగా సద్వినియోగపరుచుకుంటూ అనేక మీడియా సంస్థలకు వరసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. 


ఇలాంటి పరిస్థితులలో జూనియర్ ఎన్టీఆర్ తో ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూను ప్రసారం చేయాలని అనేక ప్రముఖ మీడియా సంస్థలు అనేక పత్రికలు చాలగట్టిగా ప్రయత్నిస్తున్నా జూనియర్ ఏమాత్రం స్పందించడం లేదు అని తెలుస్తోంది. దీనికి కారణాలు ఏమిటి అన్నవి తెలియకపోయినా లాక్ డౌన్ ముగిసిన తరువాత మాట్లాడుకుందాం అంటూ ముక్తసరిగా సమాధానం ఇస్తున్నట్లు తెలుస్తోంది.


సెలెబ్రెటీలు అంతా లాక్ డౌన్ పిరియడ్ ను తెగ ఎంజాయ్ చేస్తుంటే తారక్ ఎందుకు ఇలా సరదాగా మీడియా ముందుకు రాకుండా మౌనం వహిస్తున్నాడు అంటూ కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు కూడ ఆశ్చర్య పోతున్నారు. వాస్తవానికి జూనియర్ ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో ఇంత ఆలస్యం జరుగుతుంది అని ఊహించుకోలేదు అని అంటారు. 


ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ ఎప్పుడు పూర్తి అవుతుందో రాజమౌళికి కూడా తెలియని పరిస్థితి ఏర్పడటంతో జూనియర్ కు ఇలాంటి నైరాశ్యం ఏర్పడిందా అంటూ కొందరు ఊహగానాలు చేస్తున్నారు. ఈమధ్య ఒక ప్రముఖ జాతీయ ఇంగ్లీష్ దినపత్రిక మరికొన్ని  రోజులలో రాబోతున్న జూనియర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఒక స్పెషల్ ఇంటర్వ్యూను కవర్ చేద్దామని ప్రయత్నించినా జూనియర్ నుంచి స్పందన లేదు అంటూ గాసిప్పులు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే తారక్ పుట్టినరోజునాడు అతడి ‘ఆర్ ఆర్ ఆర్’ టీజర్ కూడ విడుదలకాదు అన్నసంకేతాలు ఉన్నాయి. కనీసం జూనియర్ మీడియాకు వరసగా ఇంటర్వ్యూలు ఇచ్చి తన పుట్టినరోజు హడావిడిని ఈ విధంగా అయినా కొనసాగిస్తే చూడాలని కోరుకుంటున్న అతడి అభిమానుల కోరికను తారక్ పట్టించుకుంటాడో లేదో చూడాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: