మహేష్ ప్రస్తుతం షూటింగ్ లు లేక ఖాళీగా ఉన్నా తన సొంత నిర్మాణ సంస్థ మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్ సంస్థ ద్వారా త్వరలో నిర్మించబోయే మూవీ ప్రాజెక్ట్స్ గురించి లోతైన ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే కనీసం తన సొంత నిర్మాణ సంస్థ బ్యానర్ నుండి ఎవరో ఒక టాప్ హీరోతో ఒక భారీ మూవీ మరో మిడిల్ రేంజ్ హీరోతో ఒక మీడియం బడ్జెట్ మూవీలు తీసే ఆలోచనలు మహేష్ లో ఉన్నాయి అని అంటున్నారు.


ఇలాంటి పరిస్థితులలో తన వ్యూహాత్మక ఎత్తుగడతో ఒకేసారి తాను ఇప్పటికే నిరాశ పరిచిన వంశీ పైడిపల్లిని అదేవిధంగా చరణ్ ను కలిపి మూవీ తీసే ఆలోచన చేస్తే ఎలా ఉంటుంది అన్న మహేష్ ఆలోచనలు ఉన్నట్లు టాక్. వాస్తవానికి రామ్ చరణ్ ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి చెప్పిన ఒక సాఫ్ట్ సబ్జెక్ట్ కు ఓకె చెప్పడంతో ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత చరణ్ సినిమా గౌతమ్ తిన్ననూరితో ఉండే అవకాశాలు చాల స్పష్టంగా కనిపిస్తున్నాయి. 


అయితే చరణ్ దృష్టిని తన వైపు మళ్ళించుకుని లేటెస్ట్ గా వంశీ పైడిపల్లి క్రియేట్ చేసిన ఒక సాఫ్ట్ లవ్ స్టోరీ చరణ్ కు అన్నివిధాల సరిపోతుందని ఆ మూవీని తానే నిర్మిస్తాను అంటూ మహేష్ చరణ్ కు ఒక భారీ ఆఫర్ ఇచ్చినట్లు టాక్. ఎప్పటి నుంచో మహేష్ కు చరణ్ తో సన్నిహిత సంబంధాలు పెంపొందించుకోవడమే కాకుండా అతడితో వ్యాపార సంబంధం అయిన వ్యవహారాలను కూడ పెద్ద స్థాయిలో చేయాలని ఆలోచనలు చేస్తున్నాడు.


దీనికితోడు నమ్రత ఉపాసనలు కూడ మంచి స్నేహితులు కావడంతో ప్రస్తుతం చరణ్ మహేష్ ల మధ్య సాన్నిహిత్యం బాగా కొనసాగుతోంది. చరణ్ మహేష్ ఇచ్చిన ఆఫర్ ను అంగీకరిస్తే తాను చరణ్ సొంత నిర్మాణ సంస్థ అయిన కొణిదల ప్రొడక్షన్ హౌస్ లో కూడ ఒక సినిమాను చేస్తానని రిటర్న్ ఆఫర్ ఇచ్చినట్లు గాసిప్పులు వస్తున్నాయి. దీనితో రామ్ చరణ్ మహేష్ వ్యూహాలకు సహకరిస్తాడా లేదంటే ఇప్పటికే తనకు నచ్చిన గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ వైపు వెళ్ళిపోతాడా అన్న విషయం రానున్నకాలంలో తేలిపోతుంది..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: