కెరీర్ లో ఎప్పుడూ ఎటువంటి కాంట్రవర్సీల జోలికి వెళ్లని మళయాళ స్టార్ హీరో దుల్కర్  సల్మాన్. మిగతా హీరోల కన్నా సమ్ థింగ్ డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ తనకంటూ సెపరేంట్ స్టార్ డమ్ క్రియేట్ చేసుకున్న దుల్కర్ ఇప్పుడు తమిళ్  ఆడియన్స్  కోపానికి బలయ్యాడు. అంతే కాదు  సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కుంటున్నాడు.

 

బేసికల్లీ మళయాళ  హీరో అయినా.. అటు తమిళ్ లో కూడా సినిమాలు చేస్తూ.. అప్పుడప్పుడు తెలుగు ప్రేక్షకుల్ని కూడా పలకరిస్తూ .. సౌత్ మొత్తానికి  క్లోజ్ అయ్యాడు ఈ స్టార్ హీరో. ఎప్పుడూ తన పనేంటో తానేంటో అంటూ.. పొలైట్ గా పలకరించే దుల్కర్  మీద తమిళ్ ఆడియన్స్ ఫుల్ కోపంగా ఉన్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో దుల్కర్ నటించిన వారణై అవశ్యముండే అనే సినిమా రిలీజ్ అయ్యి 25 కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇదే సినిమా రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది.

 

వారణై అవశ్యముండే సినిమాలో తమిళుల సెలబ్రిటీ అయిన ఎల్టీటీఈ ప్రభాకరన్ కి సంబందించిన సీన్ ని పెట్టారు . కేరళలో 1988 లో వచ్చిన  బాగా ఫేమస్ అయిన జోక్  ని ఈ సినిమాలో పెట్టింది టీమ్. ఈ సినిమా  చూసిన తమిళ జనాలు. అసలు మా ఆరాధ్య దైవం, మా హీరోని కించపరిచేలా ఉందంటూ దుల్కర్ ని తిడుతూ తమిళ్ ఆడియన్స్ గోలపెట్టేస్తున్నారు . వారణై సినిమా స్టార్టింగ్ కి ముందే డిస్ క్లైమర్ వేశామని, మేం ఎవర్నీ కించపరిచే  ఉద్దేశ్యంతో ఆ సీన్ పెట్టలేదని దుల్కర్ తమిళ ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చినా.. అసలు ఏమాత్రం వినిపించుకోవడం లేదు.

 

దుల్కర్ ఒక్కడితో ఈ విషయం వదిలేయకుండా ఈ సినిమా డైరెక్టర్ అనూప్ తో పాటు  నటించిన కళ్యాణి ప్రియదర్శన్, సురేష్ గోపి, శోభన ..ఇలా అందరినీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు ఈ గొడవలోని దుల్కర్ ఫ్యామిలీని కూడా యాడ్ చేసి తిడుతున్నారు కొంతమంది. నన్ను అనండి కానీ ..నా ఫ్యామిలీ జోలికి రావద్దని , వాళ్లకి ఏమాత్రం సంబందంలేదని అంటున్నా కూడా సోషల్ మీడియాలో దుల్కర్ మీద ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: