ఒకప్పుడు ఒకే హీరోతో 10 ..15 సినిమాలు చేసేవాళ్లు హీరోయిన్లు. బట్ ఇప్పుడు అదే హీరోయిన్ తో పదే పదే సినిమా చెయ్యడానికి ఒప్పుకోవడం లేదు మనహీరోలు . ఫ్రెష్ లుక్ కావాలి అనుకుంటూ కొత్త కొత్త వాళ్లని వెతుక్కుంటున్నారు . అందుకే సినిమా 70 పర్సెంట్ అయిపోయినా కూడా హీరోయిన్ దొరక్క ఇంకా నచ్చిన , మెచ్చిన హీరోయిన్ కోసం వెతుకుతూనే ఉన్నారు.


 
హీరోలు వరుస పెట్టి సినిమాలు లైన్లో పెట్టేశారు. చక చకా షూటింగ్ కూడా చేసేస్తున్నారు. అదికూడా హీరోయిన్లు లేకుండానే. ఎందుకంటే సేమ్ హీరోయిన్ ఎందుకని కొత్త వాళ్లకోసం వెతుకుతుంటే.. హీరోయిన్లు మాత్రం దొరకడం లేదు ఆల్ మోస్ట్ 50 పర్సెంట్‌ నుంచి 70 పర్సెంట్ షూటింగ్ అయిపోతున్నా కూడా ఇంకా హీరోయిన్ కోసం వెతుకుతూనే ఉన్నారు మేకర్స్. త్వరలో మహేష్ బాబు పరశురామ్ తో చెయ్యబోతున్న సినిమాలో హీరోయిన్ గా ఇంకా ఎవరూ ఫిక్స్ అవ్వలేదు. సారాఅలీఖాన్, కియారా, పూజా, శ్రద్దా కపూర్ ఇలా బాలీవుడ్ భామల పేర్లు వినపడుతున్నా.. ఇంకా ఎవరూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.  

 

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో షూటింగ్ స్టార్ట్ అవ్వబోతున్న సినిమాకు కూడా హీరోయిన్ దొరకలేదు . అసలు ఇప్పుడున్న హీరోల్లో ..తన హీరోయిన్లని ఎక్కువగా రిపీట్ చేసింది  ఎన్టీఆరే. అంతకుముందు అరవిందసమేతలో పూజాహెగ్డే తో సూపర్ గా ఎన్టీఆర్ కు పెయిర్ అప్ చేసిన త్రివిక్రమ్..ఈ సారి హీరోయిన్ కోసం బాగానే జల్లెడపడుతున్నాడు. ప్రభాస్ , నాగాశ్విన్ కాంబినేషన్లో ఈ ఇయర్ ఎండ్ కి స్టార్ట్ అవ్వబోతున్న ప్యాన్ వరల్డ్ మూవీకి కూడా హీరోయిన్ ని అనౌన్స్ చెయ్యలేదు . జనరల్ గా నాగాశ్విన్ .. హీరోయిన్స్ ని చాల టిపికల్ గాసెలక్ట్ చేస్తాడు . అలాంటిది  ప్యాన్ ఇండియా  స్టార్ అయిన ప్రభాస్ కు  ఏ హీరోయిన్ ని పెడదామా అని తెగ ఆలోచిస్తున్నాడట అశ్విన్.

 

అసలు హీరోయిన్ల కొరత ఎక్కవగా సీనియర్ హీరోలకే కనిపిస్తోంది. ప్రజెంట్ కొరటాల డైరెక్షన్లో చిరంజీవి చేస్తున్న ఆచార్య సినిమాకు ఇప్పటి వరకూ హీరోయిన్ కన్ఫామ్ కాలేదు. త్రిష అన్నారు, కాజల్ అన్నారు. త్రిష సినిమా నుంచి తప్పుకోవడంతో ఇంకా ఎవర్నీ అఫీషియల్ గా అనౌన్స్ చెయ్యలేదు.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన పింక్ సినమాలో కూడా ఇంకా పవన్ కు జంట దొరకలేదు. శ్రుతిహాసన్, పూజాహెగ్డే ఇలా రకరకాల పేర్లు వినిపించినా ఇంకా హీరోయిన్ ని మాత్రం  అనౌన్స్‌ చెయ్యలేదు. క్రిష్ తో చేస్తున్న ఫోక్లోర్ మూవీ షూటింగ్ కూడా స్టార్టయ్యిపోయినా ఇంకా హీరోయిన్ ని ఫిక్స్ చెయ్యలేదు పవన్ కళ్యాణ్ . ఈ సినిమాలో పవన సరసన కీర్తిసురేష్ అని టాక్ వినిపిస్తోంది.

 

మరో సీనియర్ హీరో బాలక్రుష్నకు ఫస్ట్ నుంచీ హీరోయిన్స్ ప్రాబ్లమ్ ఎక్కువే. ఈ మద్య చూస్తుంటే బాలయ్య అస్సలు తనకు స్క్రీన్ మీద మ్యాచ్ కాని యంగ్  హీరోయిన్స్ తోనే సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు బోయపాటి తో చేస్తున్న హ్యాట్రిక్ మూవీకి  స్టార్టింగ్ నుంచి హీరోయిన్ కోసం వెతుకుతున్నా..ఇంకా ఎవరూ ఓకే చెప్పలేదు. ఇలా కొంతమంది హీరోలకు ఆన్ స్క్రీన్ తోడు మాత్రం దొరకడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: