సినీ సెలబ్రిటీస్ ప్రజల కారణంగా రూ. కోట్లు దండుకుంటారు కానీ వారి కష్టకాలంలో మాత్రం ఆదుకునేందుకు అస్సలు ముందుకు రారు. వారి సహాయం మాటల వరకు మాత్రమే పరిమితమవ్వడం బాధాకరం. పిచ్చి జనాలు సినిమా రిలీజ్ కాగానే పొద్దున్నే లేచి మరీ వాళ్ళ హీరోల సినిమాలను హిట్ చేస్తారు. అటువంటి హీరోలు వెండితెరపై మాత్రమే హీరోలని నిజ జీవితంలో ఎవరికి ఉపయోగపడరని ప్రజలు ఇంకా తెలుసుకోకపోవడం దురదృష్టకరం.


కానీ సినీ ప్రముఖులందరూ అలాగే ఉంటారనుకోవడం పొరపాటే. అక్షయ్ కుమార్ రూ. 25 కోట్లు విరాళమిచ్చి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఐతే అంత డబ్బులు ఇచ్చుకోలేకపోయినా తమకు చేతనైనంత సాయం చేస్తూ పేదవారికి అన్నదానం చేసినా... అది మెచ్చుకోదగిన గొప్ప విషయమేనని చెప్పుకోవచ్చు. అత్తారింటికి దారేది సినిమాలో సమంతకు సోదరిగా నటించిన ప్రణీత పేదలకు అన్నదానం చేస్తున్నారు. తను కోట్ల రూపాయలు దానం చేయలేదు గానీ లక్షల మంది పేదవారి ఆకలిని తీరుస్తున్నారు. ఈ కన్నడ ముద్దుగుమ్మ కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అమలుకాగానే.. కాస్త డబ్బులు విరాళంగా ఇచ్చారు. లాక్ డౌన్ పొడగించేసరికి నిత్యావసర సరకులు పేదవారికి అందచేయడం ప్రారంభించారు. మళ్లీ లాక్ డౌన్ గడువుని ఎక్స్టెండ్ చేయడంతో... ఆకలితో అలమటిస్తున్న పేద వారికోసం తానే స్వయంగా భోజనం వండి, ఆహార పొట్లాలు తయారు చేసి పంపిణీ చేయసాగారు. కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే 75 వేల మందికి ఆహార పొట్లాలను అందించి తన గొప్ప దానగుణాన్ని ప్రణీత చాటుకున్నారు. తానే స్వయంగా వడ్డించడమనేది ఇక్కడ మెచ్చుకోదగిన విషయం.


ఇంట్లో ఖాళీగా కూర్చొని అట్లు వేసుకోవడం, పనికిమాలిన ఛాలెంజ్స్ విసిరడం లాంటివి చేయడం తప్ప నలుగురి పేదవారికి అన్నంపెట్టే సోయి లేని బడా సెలబ్రిటీల కంటే మంచి మనసున్న ప్రణీత చాలా గ్రేట్. అందంతో పాటు బంగారం లాంటి మంచి మనసున్న ఆమెకు ఎవరైనా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అందుకే మా దృష్టిలో హీరోయిన్ ఆఫ్ ది మంత్ బాపుగారి బొమ్మ లాగ ఉండే ప్రణీత గారే. 

మరింత సమాచారం తెలుసుకోండి: