టాలీవుడ్ లో ఇప్పుడు చాలెంజ్ లు చాలా ఆకట్టుకుంటున్నాయి. చిన్న చిన్న హీరోలు పెద్ద హీరోలు అందరూ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన ఒక చాలెంజ్ బాలీవుడ్ ని కూడా తాకింది అనే విషయం అర్ధమైంది అందరికి. తమిళ స్టార్ హీరోలు కూడా ఈ దీనికి తమ వంతుగా సహాయం అందించారు. సందీప్ చేసిన చాలెంజ్ కి జక్కన్న స్పందించడం ఆ తర్వాత రామ్ చరణ్ స్పందించడం జూనియర్ ఎన్టీఆర్ ఇలా అందరూ కూడా తమ వంతుగా స్పందించి వీడియో లను పోస్ట్ చేసారు. 

 

ఈ వీడియో లు అన్నీ కూడా అందరిని ఎంత గానో ఆకట్టుకున్నాయి. చిన్న చిన్న నటులు కూడా తమ వంతుగా వీడియో లను షేర్ చేసారు. ఇవి ప్రేక్షకులను కాస్త బాధలో నుంచి బయటకు తీసుకుని వచ్చాయి అనే విషయం అర్ధమవుతుంది. ఎవరు ఏ వీడియో విడుదల చేస్తారా అని ఆశగా ఎదురు చూసారు అందరూ కూడా. తమ హీరోలు ఇల్లు ఏ విధంగా ఉంటాయి అని కూడా ఎదురు చూసిన అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం ఈ వీడియో లకు మంచి ఆదరణ ఉండటం తో ప్రేక్షకులను అలరించడానికి ప్రధాన మీడియా కూడా ఎక్కువగా వాటిని పోస్ట్ చేస్తూ వస్తుంది. 

 

ఈ చాలెంజ్ ల ద్వారా కొంత మంది మహిళలకు తమ వంతుగా సహాయ చేస్తూ ఆ వీడియో లను పోస్ట్ చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా సరే లాక్ డౌన్ లో తమ అభిమానులను అలరించడానికి హీరోలు అందరూ కలిసి చేసిన ఈ ప్రయత్నం నిజంగా అభినందించే ప్రయత్నం అనే విషయం గట్టిగా చెప్పవచ్చు. ఈ వీడియో లు రాబోయే కాలంలో మరిన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: