తెలుగు జానపద పాటలను జమైకా మ్యూజికల్ జోనర్ ఐన (reggae) రెగె బీట్ తో మిక్స్ చేసి పాడటం మొదలెట్టిన చౌరస్తా బ్యాండ్ ఎంతగా శ్రోతల ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. చౌరస్తా మ్యూజికల్ బ్యాండ్ యూట్యూబ్ లో విడుదల చేసే ప్రతి పాటకి మిల్లియన్లలో వ్యూస్ వస్తాయంటే అతిశయోక్తి కాదు. విలేజ్ నుంచి సిటీకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తికి ఎదురయ్యే చేదు అనుభవం ఎలా ఉంటుందో... తాను తిరిగి తన ఊరికి వెళ్లిపోవాలని ఎలా అనుకుంటాడో... విసుగుతో కూడిన ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో పాట రూపంలో 'ఊరి పోతా మామ, ఊరు వెళ్ళిపోతాను మామ' అంటూ తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన చౌరస్తా బ్యాండ్... ఆ పాటను మినహాయించి 'సాగు బరువయాన రైతా' అంటూ నేటి సమాజంలో ఒక రైతు పడే కష్టాలు తీర్చలేని పొలిటిషన్స్ యొక్క స్వార్థ మైన రాజకీయాల గురించి, రైతుల ఆత్మహత్య గురించి చాలా చక్కగా పాడారు. ఈ పాట ప్రతి ఒక్కరి మనసులో కి చొచ్చుకుపోయిందంటే అతిశయోక్తి కాదు. 'ఓహ్ మాయ.. మాయ... పోరి మాయా రే, స్మైలూ మాయ హొయలు మాయ' అంటూ యువతను బాగా ఆకట్టుకునే పాటను రూపొందించి అందరి చేత ఈలలు వేయించారు. మాయ పాటకు కోటి 70 లక్షల వ్యూస్ వచ్చాయి.


ఒక 30 రోజుల క్రితం... కరోనా వైరస్ కారణంగా అమలవుతున్న లాక్ డౌన్ నిబంధనల గురించి చౌరస్తా బ్యాండ్ వారు రూపొందించిన "చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా" పాట ఇప్పటికే ఐదు లక్షల వ్యూస్ సంపాదించింది. ఈ పాట యూట్యూబ్ లో కంటే సోషల్ మీడియా ఐన ఫేసుబుక్, ఇంస్టాగ్రామ్, టిక్ టాక్, హలో లాంటి అన్ని ఫ్లాట్ఫామ్ లలో భారీ హిట్ అయ్యింది. ఒకవైపు అవగాహన కల్పిస్తూనే చాలా ముచ్చటగా పాడిన ఈ పాట ని ప్రముఖ న్యూస్ ఛానల్ వారు కూడా తరచూ ప్లే చేస్తున్నారు. అందుకే హెరాల్డ్ సాంగ్ ఆఫ్ ద మంత్ చేయి చేయి కలపకురా అని చెప్పేస్తున్నాం.


చౌరస్తా మ్యూజికల్ బ్యాండ్ లో యశ్వంత్ నాగ్ కీబోర్డ్ వాయించడం పాట పాడడం తో పాటు కంపోజ్(ఎలా పాడాలో) కూడా తానే చేస్తాడు. రామ్ మిరియాల ఫ్లూటు వాయించడంతో పాటు పాట కూడా పాట పాడతాడు. బాల పాట మాత్రమే పాడుతాడు. అక్షయ్ డ్రమ్స్ వాయిస్తే... అనంత్ బేస్ గిటార్... శ్రీనివాస రిథమ్ గిటార్ వాయిస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: