చేసిన అన్ని సినిమాలు హిట్ అవ్వాలన్న రూల్ లేదు. చేస్తున్న ప్రతీ సినిమాని హిట్ అవుతుందన్న నమ్మకంతోనే చేస్తారు. అయితే ప్రతీసారీ మనం అనుకున్నది అనుకున్నట్టు జరగకపోవచ్చు. కొన్ని సార్లు హిట్లు అవుతుంటాయి. మరికొన్ని సార్లు ఫ్లాప్ అవుతుంటాయి. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఫ్లాపు అవుతాయనుకున్న సినిమాలు హిట్ అవుతుంటాయి. హిట్ అవుతాయనుకున్న సినిమాలు ఫ్లాప్ అవుతుంటాయి.

 

అయితే ఫ్లాప్ చిత్రాలు నటీనటులకి నిరాశ కలిగించడం సాధారణమే. కొన్ని సార్లు ఆ సినిమాలో ఎందుకు నటించామా అని బాధపడిన సందర్భాలు కూడా ఉంటాయి. తాజాగా రాశీఖన్నా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించినందుకు అలాగే ఫీల్ అయిందని వార్తలు వచ్చాయి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. 

 

అయితే వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో ఆమె క్యారెక్టర్ కొంత బోల్డ్ గా ఉండడం వల్ల అప్సెట్ అయిందని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా బెడ్ సీన్స్ లో నటించినందుకు అప్సెట్ అయిందని అన్నారు. అయితే తాజాగా ఇలామ్టి వార్తలపై రాశీ ఖన్నా స్పందించింది. రాశీ ఖన్నా మాట్లాడుతూ,నేను నటించిన సినిమాల పట్ల నేనెప్పుడూ బాధపడను. సినిమాలో నా పాత్ర ఎలా ఉంటుందో తెలుసుకున్నాకే సినిమా ఒప్పుకుంటాను.

 

సినిమా సక్సెస్ అయినా కాకపోయినా ప్రతీ సినిమా నాకు ఒక అందమైన ప్రయాణం లాంటింది. ప్రతీ సినిమాలోనూ నటిగా ఎంతో కొంత నేర్చుకుంటూ ఉంటాను. నటిగా సినిమాలు చేయడం నాకు ముఖ్యం. అందువల్ల నేనెప్పుడూ సినిమాలు చేసినందుకు బాధపడనని చెప్పుకొచ్చింది. మొత్తానికి వరల్డ్ ఫేమస్ సినిమాలోని ఆమె పాత్రపై వస్తున్న పుకార్లకి చెక్ పెట్టేసింది. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో కేఎస్ రామారావు నిర్మాతగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ తెరకెక్కింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: