టాలీవుడ్ లో ఇప్పుడు సినిమాల కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. వారానికి ఒక సినిమా చూసే వాళ్ళు ప్రేక్షకులు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి దాదాపుగా లేదు అనే విషయం చెప్పవచ్చు. ఒక్క సినిమాను కూడా విడుదల చేసే అవకాశం లేదు అనేది అర్ధమవుతుంది. మన తెలుగులో సినిమాల మీద బ్రతికే వాళ్ళు ఎక్కువగానే ఉంటారు. ఏదోక విధంగా సినిమా మీద ఆధారపడే జనం ఉంటారు అనేది అర్ధమవుతుంది. టాలీవుడ్ లో సినిమా మార్కెట్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. 

 

అది చిన్నది అయినా పెద్దది అయినా సరే ఎక్కువగానే జరుగుతూ ఉంటుంది. టాలీవుడ్ జనాలు కూడా ఆ మార్కెట్ మీద చాలా ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. ఎంత మార్కెట్ జరిగితే వాళ్లకు అంత లాభం. ఇప్పుడు చాలా మంది హీరోల ఆదరణ లేక రోడ్డున పడ్డారు. పార్కింగ్ వద్ద, ఏదోక వస్తువుని తినడానికి అమ్ముకునే వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నారు. సిగరెట్ అమ్ముకునే వాడు, టీ అమ్ముకునే వాళ్ళు ఇలా చాలా మంది రోడ్డున పడ్డారు. 

 

వాళ్ళను ఆదుకునే నాధుడు ఇప్పుడు ఎవరూ కూడా లేరు. ఇక హీరోల సినిమాలు వస్తే పోస్టర్ లు అంటించే వాళ్ళు కూడా ఉంటారు కొందరు అభిమానులు. వాళ్లకు ఎంతో కొంత ఇస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇలా ఎటు నుంచి ఎటు చూసినా సరే సినిమా  మీద బ్రతికే చాలా మంది రోడ్డున పడ్డారు అనేది బలంగా స్పష్టంగా చెప్పవచ్చు. ఈ పరిస్థితి నుంచి బయటకు వచ్చి యెప్పుడు తెలుగు సినిమా కోలుకుని నిలబడుతుంది అనేది చూడాలి. మరి ఎలాంటి పరిస్థితిని ఇంకా ఎదుర్కుంటూ ఉంటుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: