ఎన్నో విభిన్నమైన సినిమాల్లో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సిద్దార్థ . తెలుగు తమిళం కన్నడ భాషల్లోనే కాకుండా హీరో సిద్ధార్థ కు ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ వుంటుంది. తనదైన నటనతో ప్రతి సినిమాలో ప్రేక్షకులను  ఆకర్షిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు సిద్ధార్థ. గతంలో రాజకీయాల్లోకి కూడా ఇన్వాల్వ్ అయ్యారు . ఇక తెలుగులో కూడా చాలానే సినిమాల్లో నటించి తెలుగులో కూడా ఎంతో మంది ప్రేక్షకుల ఆధారాభిమానాన్ని చూరగొన్నారు సిద్ధార్థ. 

 

 

కాగా  టాలీవుడ్ లో ఎవర్గ్రీన్  గా నిలిచిన చిత్రం నువ్వొస్తానంటే నేనొద్దంటానా... బొమ్మరిల్లు లాంటి సినిమాల్లో నటించి మంచి విజయాలను కూడా అందుకున్నారు  ఇక గత కొంతకాలంగా తమిళం కన్నడ  సినిమాలు చేస్తున్నప్పటికీ తెలుగులో మాత్రం సినిమాల  జోలికి రాలేదు సిద్ధార్థ. సిద్ధార్థ చివరిగా ఓ హారర్ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అది కూడా అంతగా విజయం సాధించలేదు. గతంలో ఓ మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి త్వరలోనే వస్తాను అంటూ  సిద్ధార్థ వ్యాఖ్యానించారు. కాగా సిద్దార్థ సినిమా కోసం చాలా మంది అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. 

 

 

 అయితే తాజాగా సిద్ధార్థ లేటెస్ట్ మూవీ అప్డేట్ ఒకటి  సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. టక్కర్ అనే సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఇది ప్రేక్షకులందరినీ ఆకర్షిస్తూ దూసుకుపోతుంది. ఇక ఈ పోస్టర్ లో టక్కర్  అని సినిమా టైటిల్ వుండగా.. ఈ మోషన్ పోస్టర్ లో చాలా డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నారు సిద్ధార్థ. నల్లటి కళ్లద్దాలు ధరించి కొంచెం గడ్డంతో పూర్తిగా మీసాలు తీసేసి డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు సిద్ధార్థ. ఏదేమైనా ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: