భారత చిత్ర పరిశ్రమ యొక్క దిగ్గజ నటుడు రిషి కపూర్ గత కొంతకాలంగా క్యాన్సర్ మహమ్మారి తో పోరాడుతున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో చేరిన రిషి కపూర్ గురువారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. అయితే రిషి కపూర్ మరణంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఒకరోజు వ్యవధిలోనే బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇద్దరు లెజెండరీ నటులను పోగొట్టుకోవడంతో ఒక్కసారిగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ మూగబోయింది. ఒక్క రోజు వ్యవధిలో  ఇద్దరు లెజెండరీ నటులు అయిన  ఇర్ఫాన్ ఖాన్,  రిషి కపూర్ లు  మరణించారు. 

 


 రిషి కపూర్ మరణంపై బాలీవుడ్ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది సినీ ప్రముఖులు రిషీకపూర్ మరణంపై సంతాపం తెలియజేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి రిషి కపూర్ మరణంపై సంతాపం తెలియజేశారు. రిషి కపూర్ ఇక లేడు అని తెలుసుకుని తాను షాక్కి గురయ్యాను అంటూ మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. రిషి కపూర్ ఒక గొప్ప స్నేహితుడు గొప్ప కళాకారుడు లక్షలాది మంది అభిమానుల హృదయ స్పందన అంటూ రిషి కపూర్ ని  చిరంజీవి అభివర్ణించారు.

 


 రిషి కపూర్ ఒక గొప్ప వారసత్వ వారధి... ఆయన మరణంతో నాకు మనసు ఎంతో బరువుగా మారింది  . నా స్నేహితుడికి వీడ్కోలు శాంతితో విశ్రాంతి తీసుకోండి అంటూ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. ఇక అటు విక్టరీ వెంకటేష్ కూడా రిషి కపూర్ మరణం పై సంతాపం తెలియజేశారు. భారత చిత్ర పరిశ్రమ ఇద్దరు గొప్ప ప్రతిభ గల వ్యక్తులను పోగొట్టుకోవడం నిజంగా హృదయవిదారకం.  చిన్నపిల్లల్లాంటి  హృదయం తో చిరునవ్వుని ఆనందాన్ని వ్యక్తం చేసే రిషి కపూర్ ఎల్లప్పుడు మన హృదయం లోనే ఉంటారు. మేము కలిసినప్పుడల్లా అది ఒక అభ్యాస అనుభవమే.  మీరు లేకపోవడం మా కుటుంబానికి కూడా పెద్ద నష్టమే అవుతుంది సార్... ఇలాంటి పరీక్ష సమయాల్లో కపూర్ కుటుంబానికి స్నేహితులకు ప్రగాఢ సంతాపం అంటూ వెంకటేష్ సంతాపం తెలియజేశారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా రిషి  కపూర్ మరణంపై సంతాపం తెలియజేశారు. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు లెజెండరీ నటులను పోగొట్టుకోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఎన్టీఆర్. మేము నిన్న ఎంతో ప్రతిభావంతులైన ఇర్ఫాన్ కాన్ సార్ ని కోల్పోయాము.  ఇప్పుడు దిగ్గజ రిషీకపూర్ సాబ్ ని  కూడా కోల్పోయాం. ఇది భారతీయ చిత్ర పరిశ్రమకు ఘోరమైన నష్టం అంటూ జూనియర్ ఎన్టీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: