బాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి.  నిన్న ప్రముఖ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూసిన విషయం తెలిసిందే.  ఈ విషాదాన్ని మర్చిపోకముందే నేడు బాలీవుడ్ హీరో రిషీ కపూర్ముం  ముంబాయిలోని హెచ్.ఎన్. రిలయన్స్ హాస్పిటల్ చికిత్స పొందుతూ.. కన్నుమూశారు.  2018 నుంచి ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు.  ఈ క్రమంలో ఆయన కొంత కాలం చికిత్స తీసుకున్నాడు.  అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. 67 ఏళ్ల వయస్సులోనే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది.  ఆయన మృతిపట్ల సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 

 

రిషి కపూర్ 1973లో బాబీ సినిమాతో రుషి కపూర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దివానా, కాదల్, లైలా మజ్నూ, చాందినీ లాంటి చిత్రాలు ఆయన చేశారు. 1980లో హీరోయిన్ నీతూ సింగ్‌ను పెళ్లి చేసుకున్నారు.   కాగా, రిషికపూర్ మరణవార్తతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన గారాలపట్టి, ఏకైక కుమార్తె రిద్ధిమా కపూర్ (39) ఢిల్లీలో ఉంటున్నారు.  తన తండ్రి అంటే ఎంతో ఇష్టపడే రిద్దిమా కడసారి చూపు కోసం ఎంతో రిస్క్ చేసింది. ఆమె తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు రోడ్డు మార్గంలో ఢిల్లీ నుంచి ముంబైకి బయల్దేరారు. ఆమె ప్రయాణానికి అధికారులు అనుమతించారు.

 

చార్టర్డ్ ఫ్లైట్ లో ముంబై వెళ్లేందుకు అనుమతి కోసం నిన్న రాత్రే కేంద్ర హోం మంత్రిత్వ శాఖను వీరు సంప్రదించారు.  కానీ వాయు మార్గం ద్వారా ఇప్పుడు ప్రయాణానికి అనుమతి లేకపోవడంతో.. ఆ ప్రయత్నాన్ని విరమించుకుని రోడ్డు మార్గంలో ప్రయాణించేందుకు అనుమతి తీసుకున్నారు.  ఈ నేపథ్యంలో భర్త, కుటుంబసభ్యులతో కలిసి రిద్ధిమా కపూర్ రోడ్డు మార్గంలో పయనిస్తున్నారు. ఢిల్లీ, ముంబై మధ్య ఉన్న దూరం 1,400 కిలోమీటర్లు. ఇక రిషీకపూర్ మరణ వార్త విన్నతర్వాత భారతీయ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: