కరోనా మహమ్మారిని నియంత్రించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.. ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు  సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది ..  దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు . 

 

 

 

కరోనా ను తరిమికొట్టడానికి మోదీ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది..కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అమలులోకి తీసుకొచ్చారు.. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో అన్నీ రంగాలు స్వచ్చందంగా మూతపడ్డాయి..ప్రజల్లో కరోనా పై అవగాహన కల్పించడానికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ను వేదికగా తెలియ పరుస్తున్నారు..అవ‌స‌రం లేకున్నా.. ఆన్‌లైన్ వాడుతున్న కొంద‌రు..  కొన్ని సైట్లలో ఎంట‌ర‌వుతూ.. లేనిపోని త‌ల‌నొప్పులు తెచ్చుకుంటున్నారు. దేశంలో అమ‌ల్లో ఉన్న ప్ర‌స్తుత లాక్‌డౌన్ స‌మ‌యంలో.. 30 శాతం మేర డేటింగ్ యాప్స్‌, సైట్ల వినియోగం పెరిగిందని స‌ర్వేలు సైతం అధికారిక వివ‌రాల‌ను వెల్ల‌డిస్తున్నాయి. 

 

 

 

 

 

 

గ‌తంలో డేటింగ్ సైట్స్ అన‌గానే.. అంద‌రి వేళ్లు యువ‌త వైపు వెళ్లేవి. కానీ, ఆ త‌ర‌హా యాప్‌లు, సైట్‌ల‌ను వాడే వారి సంఖ్య  మ‌ధ్య వ‌య‌స్కుల్లోను విప‌రీతంగా పెరిగింది. మ‌రీ ముఖ్యంగా అండ్ వీమెట్ అనే డేటింగ్ యాప్ యూజ‌ర్ల సంఖ్య 400 శాతం పెరిగిన‌ట్టు నిర్వాహ‌కులు వెల్ల‌డించారు. అయితే, ఇదే అదునుగా భావించిన సైబ‌ర్ నేర‌గాళ్లు.. యూజ‌ర్ల‌తో శృంగార అంశాల‌పై చ‌ర్చిస్తూ.. వారి వ్య‌క్తిగ‌త వివ‌రాల‌తోపాటు, వీడియోల‌ను సేక‌రిస్తున్నార‌ని, వీడియోలోని యూజ‌ర్ల ముఖాన్ని, బాడీని క్యాప్చ‌ర్ చేసి శృంగార వీడియోలుగా మార్ఫింగ్ చేస్తున్నార‌ని సైబర్ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ త‌రువాత మార్ఫింగ్ చేసిన వీడియోల‌ను సామాజిక మాధ్య‌మాల్లో పోస్టు చేస్తామంటూ బెదిరింపుల‌కు పాల్ప‌డి.. భారీ మొత్తంలో డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నారు.

 

 

 

 

ఇదే విష‌య‌మై స్పందించిన హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ డేటింగ్ సైట్ల‌లో పొందు ప‌రిచిన నెంబ‌ర్ల‌న్నీ ఫేక్ అని, అటువంటి సైట్ల‌కు దూరంగా ఉండ‌ట‌మే ఉత్త‌మ‌మ‌ని పేర్కొన్నారు. ముందుగా సైట్‌లో ఎంట‌రైన వ్య‌క్తి వివ‌రాల‌ను తెలుసుకుని.. ఆ వివ‌రా ఆధారంగా.. ఆ అడ్ర‌స్సుకు ద‌గ్గ‌ర‌లో ఉండే మ‌రో అడ్ర‌స్ చెప్పి మోసగిస్తుంటార‌న్నారు. ఏదేమైనా లాక్‌డౌన్  ఏకాంత స‌మ‌యాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులతో గ‌డ‌ప‌టం మంచిద‌ని మాన‌సిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: