ఈ ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘అల వైకుంఠపురములో’ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీ రిలీజ్ కన్నా ముందు ఇందులో సాంగ్స్ సామజవరగమన, రాములో రాములా, బుట్ట బొమ్మా అనే సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డుల మోత మోగించాయి. అయితే బుట్ట బొమ్మా సాంగ్ స్టెప్స్ యూత్ ని బాగా ఆకర్షించాయి. తాజాగా బుట్ట బొమ్మ పాటకు ఆస్ట్రేలియా క్రికెటర్, ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన భార్య క్యాండీస్ వార్నర్‌తో కలిసి డ్యాన్స్ చేసి అదరగొట్టాడు. ఆ దంపతులు డ్యాన్స్ చేస్తున్న సమయంలో వారి కుమార్తె కూడా స్టెప్పులు వేస్తూ కనపడింది.
బుట్టబొమ్మ పాటకు ఆయన చేసిన టిక్‌టాక్ వీడియో అల్లు అర్జున్ అభిమానులను అలరిస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జెర్సీలోనే వార్నర్ ఈ డ్యాన్స్ చేయడం గమనార్హం. సోషల్ మీడియాలో ఆ వీడియో ఎంతో వైరల్ గా మారింది. తాజాగా తన పాట ఇంత పాపులర్ కావడం.. ఓ స్టార్ క్రికెటర్ డ్యాన్స్ చేయడంతో అల్లు అర్జున్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తాజాగా దీనిపై స్పందించిన అల్లు అర్జున్.. థ్యాంక్యూ వెరీ మచ్.
మీ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశాడు. బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'అల... వైకుంఠపురములో' చిత్రంలోనిదే 'బుట్టబొమ్మా' సాంగ్. తమన్ సంగీతంలో వచ్చిన ఈ పాట అటు క్లాస్, ఇటు మాస్ ప్రేక్షకులను సైతం సమ్మోహితులను చేసింది. మొత్తానికి అల్లు అర్జున్ సాంగ్ ఎల్లలు దాటి ఆనందింపజేస్తుంది.
Thank you very much. Really Appreciate it . 👍🏼🙏🏼 https://t.co/mPJrlhhkxf
— allu arjun (@alluarjun) April 30, 2020