చియాన్ విక్రమ్ కనిపించి చాలాకాలమైనా.. ఎవరూ టచ్ చేయలేని సబ్జెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ విలక్షణ నటుడు నటిస్తున్న నాలుగు సినిమాల గురించి చెప్పాలంటే అదో మహాభారతమే అవుతుంది. నిజమే.. మహాభారతంలో కర్ణుడిలా నటిస్తున్నాడు. మహావీర్ కర్ణ పేరుతో సినిమా రూపొందుతోంది. 

 

మంచి నటుల గురించి చెప్పాల్సి వస్తే.. అందులో విక్రమ్ కూడా ఉంటాడు. సినిమా సినిమా కథలో.. క్యారెక్టర్ వేరియేషన్ చూపిస్తున్నా.. బాక్సాఫీస్ ను మెప్పించలేకపోతున్నాడు. తెలుగులో అయితే.. అపరిచితుడు తర్వాత ఇంతవరకు సరైన సక్సెస్ దక్కలేదు. ఫెయిల్యూర్స్ ఎన్ని వచ్చినా.. ఎక్స్ పెరిమెంట్స్ ను వీడకుండా దూసుకుపోతున్నాడు విక్రమ్. రీసెంట్ గా 54వ ఏట అడుగుపెట్టాడు. 

 

విక్రమ్ ప్రస్తుతం నాలుగు సినిమాలు కోబ్రా.. ధృవ నక్షత్రం.. మహావీర్ కర్ణ.. పొన్నియన్ సెల్వన్ లో నటిస్తున్నాడు. ముందుగా కోబ్రా రిలీజ్ కానుంది. దశావతారంలో కమల్ హాసన్ 10పాత్రలు పోషిస్తే.. అమ్మో అన్నారు. ఇప్పుడీ రికార్డ్ ను విక్రమ్ బ్రేక్ చేస్తున్నాడు. దశావతారం కంటే ఒకటి రెండు ఎక్కువ గెటప్స్ కాదు. కోబ్రాలో పాతిక పాత్రలు పోషించనున్నాడట. సినిమా సినిమాకు గెటప్ లో వేరియేషన్ చూపించే విక్రమ్ ఈ సారి పాతిక పాత్రల్లో ఎలా వైవిధ్యం చూపిస్తాడో చూడాలి. అజయ్ ముత్తు డైరెక్ట్ చేసే ఈ మూవీని 7స్క్రీన్ స్టూడియోస్.. వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. 

 

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటిస్తున్న ధృవ నక్షత్రం 2016లో ప్రారంభమైనా.. కొన్ని కారణాల వలన ఇంతవరకు రిలీజ్ కు నోచుకోలేదు. స్రైథ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రీతూ వర్మ.. ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్స్ కాగా.. హరీష్ జైరాజ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. 

 

ఇక మహావీర్ కర్ణ విషయానికొస్తే.. విక్రమ్ కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ 300కోట్లతో తెరకెక్కుతోంది. ఈ సినిమాతో విక్రమ్ మైథలాజికల్ మూవీస్ లోకి అడుగుపెడుతూ.. మహాభారతంలో కర్ణుడి పాత్ర పోషిస్తున్నాడు. ఆర్.ఎస్ విమల్ దర్శకత్వంలో తమిళంతో పాటు వివిధ బాషల్లో రూపొందిస్తున్నారు. న్యూయార్క్ కు చెందిన నిర్మాణ సంస్థ యునైటెడ్ ఫిల్మ్ కింగ్ డమ్ ఈ భారీ సినిమాను నిర్మిస్తోంది. సురేష్ గోపీ దుర్యోధనుడి పాత్రను పోషిస్తున్నారు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: