టాలీవుడ్ లో తండ్రి మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వీరిద్దరూ తండ్రి కొడుకులు కదా వీరిద్దరి మధ్య కొత్తగా బంధం ఏంటి  అంటారా. అయితే వీరు తండ్రి కొడుకులుగా  కాకుండా ఎక్కువగా స్నేహితులుగా కనిపిస్తు ఉంటారు. అందుకే వీరిద్దరూ ఎక్కడ స్టేజ్ మీద కనిపించిన అభిమానులు మురిసిపోతూ ఉంటారు.  ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవికి రామ్ చరణ్ కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేంటంటే రామ్ చరణ్ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు చిరంజీవి ఒక్కసారి మాత్రమే చరణ్ పై చేయి చేసుకున్నారట. అది కూడా చిరు ఎనిమిది సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తన తాత గిఫ్ట్ గా ఇచ్చిన పోలీస్ బెల్ట్ తో  చిరంజీవి  చరణ్ ను  కొట్టారట. 

 

 

 ఇక విషయాన్ని రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నాన్న ఇప్పుడు వరకు నా జీవితంలో కేవలం ఒక్కసారి మాత్రమే చేయి చేసుకున్నారని. అది కూడా  తన ఎనిమిదేళ్ల  వయసులో చేయి చేసుకున్నారు అంటూ తెలిపిన రామ్ చరణ్  దానికి గల కారణాలను కూడా వివరించారు. తన ఎనిమిదేళ్ల వయసులో ఇంటి గేటు వద్ద డ్రైవర్ సెక్యూరిటీ మాట్లాడుకోవడం విని వారి మాటలు అర్థం కాక పోవడంతో... వారు మాట్లాడిన మాటలను బాబాయ్ నాగబాబు అడిగానని... అదే సమయంలో షూటింగ్ పూర్తి చేసుకుని నాన్న  ఇంటికి వచ్చారు. దీంతో బాబాయ్ నాన్నను రూం లోకి తీసుకెళ్లి వీడు నన్ను అసభ్యకరమైన మాటలు నేర్చుకుని దానికి అర్థం అడుగుతున్నారు అంటూ కంప్లైంట్ ఇచ్చారు. 

 

 

 దీంతో కోపంతో నాన్న కు తాత గిఫ్ట్ గా  ఇచ్చిన పోలీస్ బెల్ట్ తో  8 ఏళ్ల ప్రాయంలో తనను కొట్టారని రాంచరణ్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కోపం కంట్రోల్ కాగానే దగ్గరికి తీసుకుని ఎప్పుడు అలాంటివి మాట్లాడకూడదని అవి మంచి మాటలు కాదు అంటూ చెప్పి దగ్గరకు తీసుకున్నారు అంటూ చరణ్ తెలిపారు . ఈ ఘటన తర్వాత నాగబాబు బాబాయ్ తో చాలా రోజుల పాటు నేను మాట్లాడ లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికికూడా నాన్నతో కలిసి మాట్లాడడానికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాను.  కానీ ఉపాసన మాత్రం ఎలాంటి భయం లేకుండా డైరెక్ట్ గా వెళ్లి మాట్లాడుతుంది  అంటూ చెప్పుకొచ్చారు. తమ ఇంట్లో ఉపాసనకు నాన్న చిరంజీవి గారు మంచి స్నేహితులు  అంటూ తెలిపారు చరణ్ .

మరింత సమాచారం తెలుసుకోండి: