లాక్ డౌన్ టైమ్ లో రామ్ చరణ్ తప్ప మెగా హీరోలందరూ దూకుడు చూపిస్తున్నారు. మెగా ఫ్యామిలీలో నలుగురు స్టార్స్ ఉంటే.. పవన్ కళ్యాణ్.. బన్నీ చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి. రామ్ చరణ్ మాత్రం ట్రిపుల్ ఆర్ తప్ప మరో మూవీ ఓకే చేయలేదు. 

 

ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్సినిమా చేస్తున్నాడంటే.. చెప్పడం కష్టం. ట్రిపుల్ ఆర్ పూర్తి కాకుండా.. చెర్రీ చిరంజీవి, కొరటాల కాంబినేషన్ లో మూవీ ఆచార్యలో గెస్ట్ రోల్ పోషిస్తున్నాడు. ఇందులో చిరంజీవి హీరో కాబట్టి.. రామ్ చరణ్ ఓ 20నిమిషాలు కనిపించి వెళ్లిపోతాడు కాబట్టి ఈ ప్రాజెక్ట్ పెద్దగా లెక్కలోకి రాదు. ఆచార్య తర్వాత చిరంజీవి ఐదారుగురు దర్శకులను లైన్ లో పెట్టాడు. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో మళయాళం హిట్ లూసిఫర్ రీమేక్ లో నటిస్తాడు. చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జై లవకుశ ఫేమ్.. బాబి.. మెహర్ రమేశ్ చిరంజీవి కోసం కథలు రెడీ చేస్తున్నారు. 

 

వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ దూకుడు చూపిస్తున్నాడు. లాక్ డౌన్ ఎత్తివేసి పరిస్థితులు చక్కబడితే.. వకీల్ సాబ్ బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో.. హరీశ్ శంకర్ దర్శకత్వంలో మరో మూవీ కమిట్ అయ్యాడు పవన్. 

 

ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై బన్నీ పక్కా ప్లానింగ్ లో ఉన్నాడు. అల వైకుంఠపురములో రిలీజ్ కాకుండానే రెండు సినిమాలు ఎనౌన్స్ చేశాడు. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సెట్స్ పైకి వచ్చిందో లేదో కరోనా అడ్డుపడింది. నానీతో ఎంసీఏ తీసిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ మూవీ ఎనౌన్స్ చేశారు. ఇలా మెగా హీరోలందరూ చేతినిండా సినిమాలతో ఉంటే.. రామ్ చరణ్ మాత్రం ట్రిపుల్ ఆర్ నే నమ్ముకున్నాడు. జెర్సీ తీసిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తాడని ప్రచారం జరుగుతున్నా ఎనౌన్స్ చేయలేదు. 

 

చిరంజీవి.. పవన్.. బన్నీ మాదిరి పక్కా ప్లానింగ్ తో లేకపోయినా.. తనకేమీ లేదన్న ఫీలింగ్ తో చెర్రీ ఉన్నాడట. ట్రిపుల్ ఆర్ రిలీజ్ లేటయినా.. ఈ లోగా ఆచార్యతో సందడి చేయొచ్చన్న ఫీలింగ్ తో ఉన్నాడు చెర్రీ. 2019 సంక్రాంతికి వచ్చిన వినయ విధేయ రామ తర్వాత రామ్ చరణ్ ఆచార్యలో కనిపించనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: