తెలుగులో ఈమధ్య కొత్త కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఇందుకు కారణం కొత్త కాన్సెప్టులతో వస్తున్న డైరక్టర్లే. వారిలో ఉన్న ఉత్సాహంతో రాసే కథలను నిర్మాతలు ఆహ్వానిస్తూ తెరకెక్కిస్తున్నారు. అలా కొత్త కాన్సెప్ట్ తో తొలి చిత్రంతోనే సక్సెస్ అయిన డైరక్టర్ స్వరూప్. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాను అద్భుతంగా తెరకెక్కించి టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ రాసే పనిలో ఉన్నాడు.

 

 

దర్శకుడిగా సస్పెన్స్ థ్రిల్లర్స్ తీయడం ఇష్టమని సాయి శ్రీనివాస ఆత్రేయ కూడా అలా తీసిందేనని అంటున్నాడు. ఈ సినిమాకు సీక్వెల్ గా రాసుకుంటున్న కథలో ఆ సినిమాకు తగ్గ ఛాయలేమీ ఉండవని అంటున్నాడు. సీక్వెల్ కధే అయినా కమర్షియల్ ట్రాక్ లో ఉంటుందని చెప్తున్నాడు. ప్రస్తుతం ఈ కథకు సబంధించి పనులు పూర్తి కావొస్తున్నాయని అంటున్నాడు. ప్రేక్షకులకు నచ్చేలా సినిమా తీయగలిగితే అది ఏ జోనర్ లో ఉన్నా ఆకట్టుకుంటుందని అన్నాడు. ఇటువంటి సినిమాలకు దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తన ‘ఐతే’ సినిమాతో బీజం వేసారని చెప్పుకొచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో అభిమానమని.. ఆయనతో సినిమా చేయడం ఓ డ్రీమ్ అని అంటున్నాడు ఈ యంగ్ డైరక్టర్.

 

 

కొత్త తరహా కాన్సెప్టులపైనే ఇప్పుడు హీరోలందరి చూపు ఉందని చెప్పాలి. ఏమాత్రం కథ కొత్తగా ఉన్నా తమకు కొంత అనుకూలంగా మార్చుకునైనా సరే చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు. ప్రేక్షకుల అభిరుచి సినిమా సినిమాకు మారిపోతున్న పరిస్థితుల్లో కొత్త దర్శకులకు ఇది ఓ వరం అనే చెప్పాలి. గతంలో కొంతకాలం ఓ ట్రెండ్ కొన్నాళ్లు నడిచేది. ప్రస్తతుం ఆ అవకాశం లేదు. కాబట్టి స్వరూప్ లాంటి డైరక్టర్లు ఏమాత్రం తమ కథతో హీరోలను మెస్మరైజ్ చేయగలిగినా కొత్త తరహా సినిమాలు సాధ్యమే.

మరింత సమాచారం తెలుసుకోండి: