బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సోషల్ మీడియాలో సినీ రాజకీయ ప్రముఖులతో పాటు ఎంతో మంది అభిమానులు ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇది మరువక ముందే మరో లెజెండరీ నటుడు రిషి కపూర్ ఈ రోజు తుది శ్వాస విడిచారు. దీంతో సినీ ఇండస్ట్రీ మొత్తం మూగబోయింది. అయితే కొందరు మాత్రం ఇలాంటి సమయాల్లోనూ వారి వక్రబుద్దిని బయట పెడుతున్నారు. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడుతూ విమర్శలకు గురవుతున్నారు. 'అక్షయ్ కుమార్‌ను తీసుకునిపోయి చనిపోయిన ఇర్ఫాన్ ఖాన్ ని తిరిగి పంపించండని' ఓ వ్యక్తి ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

 

అక్షయ్ కుమార్‌ ను తీసుకుని ఇర్ఫాన్ ఖాన్ తిరిగి పంపించండని చేసిన ట్వీట్‌కు ఓ నెటిజన్ స్పందిస్తూ.. 'మీకు అంతగా ద్వేషం కలిగేలా అక్షయ్ ఏం చేశారు..మోడికి మద్దతు చేయడం తప్పా.. ఆయన కష్టపడతారు, ఏడాదికి నాలుగు సినిమాలు చేసుకుంటారు.. ఆయన బతుకేదో ఆయన బతుకుతున్నారు. ఆయన తన కష్టంతోనే డబ్బులు సంపాదించుకుంటున్నారు. అయినా సరే ఈ జనాలెందుకు ఆయన్ను అంతగా ద్వేషిస్తారని' ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కాస్తా దర్శకుడు హరీష్ శంకర్ వద్దకు చేరడంతో ఆయన గట్టిగా కౌంటర్ వేశాడు. హరీష్ శంకర్ ఈ ట్వీట్స్‌ పై స్పందిస్తూ.. 'అక్షయ్ కుమార్‌ ను తీసుకుని ఇర్ఫాన్ ఖాన్ తిరిగి పంపించండని అంటున్నారు.. అది అంత సులభమా.. ఒకవేళ అదే జరిగితే అలాంటి మైండ్ సెట్ ఉన్నందుకు ఎంతో మంది ఆమెను తీసుకెళ్లమని అనేవారు.. మొదటగా ఆమె ఇక్కడ ఉండేది కాదు' అని కౌంటర్ ట్వీట్ వేశాడు. 

 

 

అంతేకాకుండా బాలీవుడ్ వివాదాస్పద నటుడు కమల్ ఆర్ ఖాన్ కూడా వీరి మరణాలపై వివాదాస్పద ట్వీట్ చేసాడు. ఇండస్ట్రీ ప్రముఖుల మీదా.. సినిమాలపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎప్పడూ వార్తలలో ఉంటాడు ఈ నటుడు. ఒక తరుణంలో ఇతని చర్యలు శృతిమించి పోవడంతో తన సోషల్ మీడియా అకౌంట్స్ కూడా డిలీట్ చేశారు. ఇప్పుడు తాజాగా 'కరోనా వైరస్ కొందరు ఫేమస్ లీడర్స్ ని తీసుకొనిపోనిదే ఇక్కడి నుండి పోదని నేను కొన్ని రోజుల క్రితమే చెప్పాను. అందరూ నన్ను తిడతారని చనిపోయే వారి పేర్లు మాత్రం బయటకి చెప్పలేదు. ఇర్ఫాన్ ఖాన్ మరియు రిషి కపూర్ మరణిస్తారని నాకు ముందే తెలుసు. అంతేకాకుండా నెక్స్ట్ ఎవరు చనిపోతారో కూడా నాకు తెలుసు' అంటూ వివాదాస్పద ట్వీట్ చేసాడు. దీంతో కమల్ ఆర్ ఖాన్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుకు పడుతున్నారు. ఈ ట్వీట్ వైరల్ అవడంతో ఇప్పుడు ఆ ట్వీట్ ని తొలగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: