టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన హీరో అల్లరి నరేష్. ఆయన సినిమాలు అనగానే ప్రేక్షకులకు ఒకరకంగా చెప్పాలి అంటే పండగ లాంటి వాతావరణం ఉంటుంది ఆయన తో సినిమా చేయడానికి ఒకప్పుడు చిన్న చిన్న దర్శకులు చాలా మంది ఆసక్తి చూపించే వారు  ఆయన సినిమాలో కామెడి ఉంటే చాలు ఆడుతుంది. కాని ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. చాలా మంది యాక్షన్ సినిమాలతో పాటుగా కాస్త కథ భిన్నంగా ఉండి అలరించే విధంగా ఉంటే చాలు అనుకుంటున్నారు. దీనితో అల్లరి నరేష్ ఇప్పుడు సినిమాలకు దాదాపుగా దూరంగా ఉన్నాడు. 

 

ఆయన తో సినిమా చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇటీవల ఆయన నటించిన సినిమా ఒక్కటే. అది ఏంటీ అంటే మహర్షి. ఇప్పుడు ఆయన చేతిలో సినిమా ఉందో లేదో కూడా చెప్పడం కష్టమే. ఆయన సినిమాల కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా లేరు కాబట్టి ఆయన తో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు కూడా అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆయన ఎన్టీఆర్ సినిమాలో ఒక కీలక పాత్ర చేసే అవకాసం ఉందని అంటున్నారు. ఆయన కోసం త్రివిక్ర౦ ఒక పాత్ర ను కూడా రెడీ చేసినట్టు సమాచారం. 

 

ఆయన తో సినిమా చెయ్యాలని ఎప్పటి నుంచో త్రివిక్రమ్ లో ఒక ఆలోచన ఉంది. అందుకే ఇప్పుడు ఆయనకు అవకాశం ఇచ్చి ఉండవచ్చు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కథ రెడీ గా ఉన్నా సరే అల్లరి నరేష్ తో సినిమాకు అంతగా ముందుకు రాలేదు అని అంటూ ఉంటారు. టాలీవుడ్ లో ఇప్పుడు త్రివిక్రమ కి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు ఆయన తో సినిమా చేస్తే తనకు బాగుంటుంది అనే భావన లో ఉన్నాడట అల్లరి నరేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: