నందమూరి నటసింహం బాలయ్య హీరోగా మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సింహా సినిమా 2010లో సరిగ్గా నిన్నటి రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో గొప్ప విజయాన్ని అందుకోవడం జరిగింది. ఇక ఈ సినిమా నిన్నటితో సక్సెస్ఫుల్ గా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భముగా పలువురు నందమూరి ఫ్యాన్స్ పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా దీనిని ఒక ట్రెండ్ గా సెట్ చేసి పరిగెత్తించారు. ఇక బాలయ్య, బోయపాటి ల కాంబో లో వచ్చిన రెండవ సినిమా లెజెండ్ కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టి వీరిద్దరిదీ మంచి క్రేజీ కాంబో అనే పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి మూడవ సారి ఒక సినిమా చేస్తున్నారు. 

 

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా ఎంతో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ఇకపోతే సింహా పదేళ్ల సక్సెస్ సంబరం సందర్భంగా నిన్న ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో దర్శకుడు బోయపాటి పలు ఆసక్తిరక విషయాలు వెల్లడించారు. బాలయ్య గారితో తాను చేసిన సింహా, లెజెండ్ లను మించేలా ప్రస్తుతం తీస్తున్న సినిమా తయారవుతోందని, తప్పకుండా నందమూరి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆదరించేలా ఈ సినిమా ఉంటుందని బోయపాటి అన్నారు. 

 

ఇక ఇటీవల ఒక భారీ షెడ్యూల్ జరుపుకున్న ఈ సినిమాలో బాలయ్య పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉంటుందని, కొంత అఘోర ఛాయలున్న పాత్రలో బాలయ్య నటిస్తున్న మాట వాస్తవమేనేని చెప్పిన బోయపాటి, పూర్తి కథ, కథనాలు ఎలా ఉంటాయి, ఆయన క్యారెక్టర్ లో పవర్ ఎలా ఉంటుంది అనేది రేపు రిలీజ్ తరువాత వెండితెర పైనే చూడాలని అన్నారు. బోయపాటి మాటలతో నందమూరి ఫ్యాన్స్ లో అప్పుడే సంబరాలు మొదలయ్యాయి. తప్పకుండా తమ హీరోతో బోయపాటి చేస్తున్న ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని, భారమంతా బోయపాటి మీద వేసిన తాము, దీనితో మా బాలయ్య కు ఆయన పక్కాగా హ్యాట్రిక్ హిట్ ఇచ్చితీరుతారని ఆశాభావ్యం వ్యక్తం చేస్తూ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.....!!! 

మరింత సమాచారం తెలుసుకోండి: