టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న వకీల్ సాబ్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కెరీర్ పరంగా రెండేళ్లు గ్యాప్ తీసుకున్న తమ హీరో నుండి రాబోతున్న వకీల్ సాబ్ మంచి సక్సెస్ కొట్టడం ఖాయం అని ఆయన అభిమానులు ఆ సినిమా పై ఎన్నో నమ్మకాలు పెట్టుకుని ఉన్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మగువ మగువ సాంగ్ ఇప్పటికే రిలీజ్ అయి ఫ్యాన్స్ ని ఎంతో ఖుషి చేసాయి. ఇక దీనితో పాటు క్రిష్ దర్శకత్వంలో శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై పవన్ మరొక సినిమా చేస్తున్నారు. 

IHG

అలానే దాని అనంతరం గబ్బర్ సింగ్ దర్శకడు హరీష్ శంకర్ తో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వేరొక సినిమా చేయనున్నారు పవన్. అయితే పవన్ సినిమాల విషయమై ఆయన అభిమానులు ఆశిస్తోంది మాత్రం మంచి మాస్ హిట్ కోసమే. ఎందుకంటే క్లాస్ తో పాటు మాస్ లో కూడా విపరీతమైన క్రేజ్ కలిగిన పవన్ కు, ఈ సమయంలో ఒక మంచి మాస్ సినిమా పడితే దాని ఫలితం అత్యద్భుతం అని వారు అంటున్నారు. వాస్తవానికి ఎనిమిదేళ్ల క్రితం హరీష్ శంకర్ తీసిన గబ్బర్ సినిమా రికార్డ్స్, ప్రభంజనాన్ని ఆయన ఫ్యాన్స్ ఇంకా మరిచిపోలేదనే చెప్పాలి. అప్పట్లో కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురు చూసిన పవన్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అందించిన సినిమా అది. 

 

కాబట్టి తమ హీరోకి ఇటువంటి టైంలో గబ్బర్ సింగ్ మాదిరిగా మంచి మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ ని తాము ఆశిస్తున్నామని, అలానే ఇటీవల దర్శకుడు హరీష్ తో పవన్ సినిమా ఖాయం అవడంతో మళ్ళి వారిద్దరి కాంబోలో అదే రేంజ్ సినిమా వచ్చే అవకాశం కనపడుతోందని, ఒకవేళ అదే గనుక జరిగితే తమ ఫ్యాన్స్ అందరికీ పండుగే అని వారు అంటున్నారు. మరి పవన్ ఫ్యాన్స్ ఆశిస్తున్నట్లుగా ఆయనకు మంచి మాస్ సినిమా ఎప్పుడు వస్తుందో, అటువంటి సినిమాని ఏ దర్శకుడు ఆయనతో తీస్తాడో చూడాలి....!!!

మరింత సమాచారం తెలుసుకోండి: