ఈ మద్య కాలంలో సినిమాల కంటే కూడా వెబ్ సిరీస్ లు చూడటానికే ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కంటెంట్ ఎలా ఉన్నా కూడా ఫ్యామిలీస్ అందరూ ఒకే దగ్గర సరదాగా గడుపుతూ ఈ వెబ్ సిరీస్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు కారణం వెబ్ సిరీస్ కూడా సినిమాలకి ఏమాత్రం తగ్గ కుండా భారీగా నిర్మిస్తున్నారు. మంచి కా న్సెప్ట్  కూడా ఉంటుంది. అన్ని జోనర్స్ లోను మేకర్స్ ఈ వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నారు. ఇక ప్రేక్షకులకి అంతకంటే కావాల్సిందేముంది.

 

నెట్ ఫ్లిక్స్, అమోజాన్ లాంటి ఓటిటి ప్లాట్ ఫాంస్ వచ్చి ప్రేక్షకులను కనువిందు చేస్తున్నాయి. దాంతో ప్రేక్షకులకి మరింత దగ్గరవడానికి పాపులారిటీని సంపాదించుకోవడానికి ఇప్పటికే చాలామంది స్టార్స్ ఈ తరహా వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. సంపాదన కూడా భారీగా వస్తోంది. ఇక సినిమాకి కేటాయించినట్టు నేల తరబడి డేట్స్ ఇవ్వాల్సిన అవసరమూ ఉండదు. కాబట్టే టాలీవుడ్ స్టార్స్ అందరూ ఎక్కువగా ఈ వెబ్ సిరీస్ కి ప్రాధాన్యం ఇస్తున్నారు. అడల్ట్ కంటెంట్, రొమాంటిక్ సిరీస్, సస్పెన్స్ థ్రిల్లర్స్, గ్యాంగ్ స్టర్ బ్యాగ్డ్రాప్ ..ఇలా రక రకాల జోనర్స్ లో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ లు నిర్మించి డైరెక్ట్ గా ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. బాలీవుడ్ నుండి వచ్చిన ఈ కల్చర్ ఇప్పుడు టాలీవుడ్ లో బాగా సాగుతోంది.

 

ఇప్పటికే మాధవన్, తమన్నా, సమంత, ప్రియమణి, జగపతి బాబు ఇలా చాలామంది సౌత్ యాక్టర్స్ ఇప్పుడు వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఫ్యామిలీ మాన్ సీజన్ 1 లో ప్రియమణి నటించగా ఇప్పుడు ఇదే వెబ్ సిరీస్స్ సీజన్ 2 లో అక్కినేని సమంత నటిస్తుంది. ఇప్పటికే తనకి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీటయింది. ఈ వెబ్ సిరీస్ లో సమంత నెగిటివ్ రోల్ పోషించిందిదట. అలాగే జగపతి బాబు కూడా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఇందులో కండోం ఫ్యాక్టరీ ఓనర్ పాత్రలో జగపతి బాబు నటించడం ఆసక్తి కరమైన విషయం.

 

ఇక ఆహా అన్న పేరుతోను కొన్ని వెబ్ సిరీస్ రానున్నాయి. ఈ వెబ్ సిరీస్ లలో నాగ చైతన్య, రానా, మంచు మనోజ్ ..మెగాస్టార్ చిరంజీవి ..ఇలా దాదాపు టాలీవుడ్ స్టార్స్ అందరూ సిద్దమవుతున్నారు. ఇక మెగాస్టార్ కూతురు ఒక వెన్ సిరీస్ ని డైరెక్ట్ చేయబోతుండగా అందులో మెగాస్టార్ నటించబోతుండటం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: