డైరక్టర్స్ కేవలం ఆన్ స్క్రీన్ మీద హీరో, హీరోయిన్ లతో లవ్ స్టోరీ పండించడం కాదు రియల్ లైఫ్ లో కూడా లవ్ స్టోరీ నడిపిస్తారు. ముఖ్యంగా గ్లామర్ ఫీల్డ్ లోనే ఉంటూ ఇక్కడ హీరోయిన్స్ నే పెళ్లాడిన దర్శకులు ఉన్నారు. స్టార్ డైరక్టర్, స్టార్ హీరోయిన్ రియల్ లైఫ్ జోడీ సూపర్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఇక వారిలో చెప్పుకుంటే కోలీవుడ్ డైరక్టర్ హరి కూడా వస్తారు. తమిళ యాక్టర్ విజయ్ కుమార్ కూతురు ప్రీతి అదేనండి పేరు మార్చుకుని ప్రీతగా పిలవబడే హీరోయిన్ ను పెళ్లాడాడు. 

 

ప్రీతి అలియాస్ ప్రీత విజయ్ కుమార్ తెలుగులో రుక్మిణి సినిమాలో నటించింది. ఆ తర్వాత వైఫ్ సినిమాలో కూడా అలరించింది. హీరోయిన్ గా కెరియర్ స్టార్ చేసిన ఆమె తెలుగు, తమిళ భాషల్లో పెద్దగా అవకాశాలు అందుకోలేదు. ఇక డైరక్టర్ హరి ఆమెను చూసి ప్రేమించడం ఆమె కూడా అతని ప్రేమని ఒప్పుకోవడంతో 2002 లో వీరి మ్యారేజ్ జరిగింది. కోలీవుడ్ స్టార్ డైరక్టర్స్ లో హరి ఒకరు. ఆయన డైరెక్ట్ చేసిన సామి, కోవిల్, అరుళ్ సినిమాలతో పాటుగా సింగం సీరీస్ లను డైరెక్ చేశారు. సింగం 1,2,3 తమిళంలో లోనే కాదు తెలుగులో కూడా మంచి ఫలితాన్ని అందుకున్నాయి. 

 

ప్రస్తుతం హరి సూర్యతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సింగల్ సీరీస్ లు సూపర్ హిట్ అవుతున్నా.. కొత్త కథతో హరి రావాడంతో అరువా సినిమా చేస్తున్నారు. డైరక్టర్ గా సూపర్ క్రేజ్ సంపాదించిన హరి డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాడు. కానీ స్టార్ హీరోలు ఎవరు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు.                   

మరింత సమాచారం తెలుసుకోండి: