సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లో ఎన్నో సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. కమర్షియల్ సినిమాలకు అప్పట్లో కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు కృష్ణ. కెరీర్లో అపురూపమైన చిత్రాలు ఎన్నింటిలోనే నటించిన కృష్ణకు ఆభరణంలా నిలిచిపోయిన సినిమా ‘అల్లూరి సీతారామరాజు’. 1974 మే1న విడుదలైన ఈ సినిమాకు నేటితో 46ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం ఓ చరిత్ర. తెలుగులో సినిమా స్కోప్ లో తెరకెక్కిన మొదటి సినిమాగా అల్లూరి సీతారామరాజు రికార్డు సృష్టించింది. కృష్ణ కెరీర్లో ఇది 100వ సినిమా కావడం విశేషం.

IHG

 

ఈ సినిమాలో కృష్ణ నటన నభూతో నభవిష్యతి. త్రిపురనేని మహారధి రాసిన మాటలు తూటాల్లా పేలాయి. కృష్ణ వీరోచితంగా ఆయన చెప్పిన డైలాగులకు ధియేటర్లు దద్దరిల్లిపోయాయి. కృష్ణ రూపం, ఆహార్యం చూసిన ప్రేక్షకులకు నిజంగా అల్లూరిని చూసినంత అనుభూతిని పొందారు. కృష్ణ కూడా అల్లూరి పాత్రలో పరకాయ ప్రవేశమే చేశారు. ఆదినారాయణ రావు అందించిన సంగీతం సినిమాకు అలంకారంగా నిలిచాయి. ‘తెలుగు వీర లేవరా’, ‘వస్తాడు నా రాజు’ పాటలు సూపర్ హిట్టయ్యాయి. సినిమాలో హీరోయిన్ గా విజయనిర్మల నటించారు. పద్మాలయా స్టూడియోస్ బ్యానర్ పై కృష్ణ స్వయంగా నిర్మించిన ఈ సినిమాకు వి.రామచంద్రరావు దర్శకత్వం వహించారు.

IHG

 

సినిమాను విశాఖ, తూర్పు గోదావరిలోని మన్యం ప్రాంతంలో తెరకెక్కించారు. సినిమా చూసిన ప్రేక్షకులకు స్వాతంత్ర పోరాట కాంక్ష రగిలిందంటే అతిశయోక్తి కాదు. సినిమాలో పాట రాసిన శ్రీశ్రీకి జాతీయస్థాయిలో ఉత్తమ గేయ రచయిత అవార్డు దక్కింది. 1975లో మాస్కోలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఈ సినిమా ప్రదర్శించారు. 19 సెంటర్లలో 100 రోజులు ఆడిన ఈ సినిమా 2సెంటర్లలో 175 రోజులు ప్రదర్శితమైంది. షిప్టులతో హైదరాబాద్ లో 365 రోజులు ఆడింది. కృష్ణ కెరీర్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: