అందాల తార రాశి బాలనటిగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి... అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన గోకులంలో సీత(1997), శుభాకాంక్షలు(1997) సినిమాల్లో నటించి సూపర్ క్రేజ్ ని సంపాదించుకున్నారు. 1997 నుండి 2003 వరకు ఆమె శ్రీరామచంద్రులు, సందడే సందడి, త్రినేత్రం, నాగ ప్రతిష్ట, అక్క బావ ఎక్కడా?, అమ్మో ఒకటో తారీకు, దేవుళ్ళు, మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది, సుప్రభాతం లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా అలరించారు. ఐతే 2003 సంవత్సరంలో రాశి 'ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు' చిత్రంలో నటిస్తుండగా... ఆమెకు శ్రీనివాస్ అనే ఓ అసోసియేట్ డైరెక్టర్ పరిచయమయ్యాడు. వీళ్లిద్దరి పరిచయం కాస్త వింతగా ఏర్పడిందని చెప్పొచ్చు.


'ఒక పెళ్ళాం ముద్దు... రెండో పెళ్ళాం వద్దు' చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు... రాశి ఆ చిత్రం యొక్క అసోసియేట్ డైరెక్టర్ ఐన శ్రీనివాస్ ని బాగా గమనించేదట. ఒకానొక రోజు తనని ఎలాగైనా ఆటపట్టించాలనుకున్న రాశి... ఆ సినిమాలోనే తనతో పాటు నటిస్తున్న ఒక మహిళతో శ్రీనివాస్ వద్దకు వెళ్లి తానేదో చెప్పినట్టుగా చెప్పి రమ్మన్నదట. దానికి అంగీకరించిన ఆ మహిళ శ్రీనివాస్ ని కలిసి... రాశి మీ గురించి ఒక విషయం చెప్పింది. అందేంటో తెలుసుకోవాలంటే మీరు ఆమెనే అడగండి' అని చెప్పి వెళ్లిపోయిందట. నా గురించి ఏం చెప్పి ఉంటుందబ్బా అనుకుంటూ రాశి దగ్గరకు వెళ్లి 'ఏమండీ, నా గురించి ఏదో చెప్పారంట కదా. ఏంటో తెలుసుకోవచ్చా?' అని ప్రశ్నించగా... 'హహహ, ఆ విషయం ఏంటో మీకు సాయంత్రం ఫోన్ చేసి చెప్తాను లే' అని ఆమె అక్కడినుండి తుర్రుమన్నదట.


ఈ అగ్రహీరోయిన్ నా గురించి చెప్పడానికి ఏముంటుందబ్బా అని తీవ్రంగా ఆలోచిస్తున్న క్షణంలోనే రాశి తనకి ఫోన్ చేసి... 'ఏమండీ శ్రీనివాస్ గారు. మీరు చాలా కష్టపడుతున్నారు. మీరు ఖచ్చితంగా గొప్ప డైరెక్టర్ అవుతారు. ఇదే చెప్తాము అనుకున్నాను అండి' అని చెప్పిందట. ఇక ఆ రోజు నుండి వీళ్లిద్దరి మధ్య ప్రతిరోజూ ఫోన్ సంభాషణలు కొనసాగేవి. రోజులు గడిచినా కొద్దీ వీరి మధ్య స్నేహం, ప్రేమ పుట్టుకొచ్చాయి. సరిగ్గా 2004, మార్చి 23 తేదీన రాశి శ్రీనివాస్ తో మాట్లాడుతూ 'ఏమండీ, మనం పెళ్లి చేసుకుందామా?' అని సూటిగా అడిగిందట. షాకైన ఆయన ఆ తరువాత తేరుకొని సరే చేసుకుందాం అని అన్నాడట. వెంటనే తాను శ్రీనివాస్ ని పెళ్ళాడుతున్నానని రాశి తన ఇంట్లో చెప్పగా తన తల్లి, అమ్మ ఒప్పుకోకపోవడంతో... నా పెళ్లి నా ఇష్టం. మీరేంటి ఒప్పుకునేది అని ఆగ్రహించగా... చివరకి వాళ్ళు కూడా వీళ్లిద్దరి పెళ్లికి ఒప్పుకున్నారట. దాంతో ఆమె శ్రీనివాస్ ని ఏప్రిల్ 23, 2004 న తన కుటుంబ, బంధుమిత్రుల సమక్షంలో పెళ్లాడింది. శ్రీనివాస్ తో కలిసి ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. వీళ్ళిద్దరికి పెళ్ళై 16 సంవత్సరాలు దాటినా... వారి వివాహ బంధంలో ఎటువంటి గొడవలు, సమస్యలు తలెత్తలేదని ఆమె చెప్పుకొస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: