ఎవరి ఫేట్ ఎపుడు మారుతుందో ఎవరూ చెప్పలేరు. కొన్నిసార్లు డెడ్ స్లోగా ఉన్నవాళ్లు కూడా ఫాస్ట్ ట్రాక్ లోకి వస్తారు. మెగా సినిమాలతో స్టార్ రేసులో చోటు సంపాదించుకుంటారు. ఇప్పుడు శ్రీరామ్ వేణు కూడా ఇలాగే మొదటిసారి నెంబర్ గేమ్ లో అడుగుపెడుతున్నాడు. 

 

శ్రీరామ్ వేణు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 9ఏళ్లు అవుతోంది. ఓ మై  ఫ్రెండ్ తో మెగా ఫోన్ పట్టిన ఈ దర్శకుడు అప్పటి నుంచి స్టార్ జోన్ కి చాలా దూరంగానే ఉన్నాడు. అయితే ఇప్పుడీ మేకర్ కు టాప్ రేసులో జాయిన్ అయ్యే అవకాశం వచ్చింది. వరుసగా స్టార్ హీరోస్ ని డైరెక్ట్ చేస్తూ నెంబర్ గేమ్ లో అడుగుపెట్టే ఛాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ సినిమాలతో వేణు గ్రాఫ్ మారేలా కనిపిస్తోంది. 

 

శ్రీరామ్ వేణు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ తీస్తున్నాడు. రెండేళ్లు గ్యాప్ తీసుకున్న పవన్ ఈ సినిమాతోనే రీఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ లో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. కొంచెం గ్యాప్ తర్వాత వస్తోన్న పవన్ఈ మూవీతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో అని ఇండస్ట్రీ జనాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

 

వకీల్ సాబ్ తర్వాత అల్లు అర్జున్ తో ఐకాన్ చేయబోతున్నాడు శ్రీరామ్ వేణు. అయితే ఈ సినిమా వకీల్ సాబ్ కంటే ముందే ఎనౌన్స్ అయింది. కానీ అల్లు అర్జున్ పుష్పతో బిజీ అవ్వడం, పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో ఐకాన్ ని వాయిదా వేసుకున్నాడు. వకీల్ సాబ్ తో బిజీ అయ్యాడు.

 

సో ఈ స్టార్స్ తో తీస్తున్న సినిమాలు హిట్ అయితే శ్రీరామ్ వేణు గ్రాఫ్ మరో లెవల్ కు వెళ్తుందని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: