టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఎవరికీ తెలియదు? ప్రతి ఒక్కరికి తెలుసు.. అయితే రామ్ గోపాల్ వర్మకు శ్రీదేవి అంటే ప్రాణం. ఈ విషయాన్నీ అయన ఎన్నో సార్లు ఎన్నో చోట్లా చెప్పాడు. వచ్చే జన్మ అంటూ ఉంటే బోణి కపూర్ లా పుట్టాలని ఉంది అని అంటుంటాడు వర్మ. 

 

శ్రీదేవి అంటే అంత ఇష్టం రామ్ గోపాల్ వర్మకు.. అయితే శ్రీదేవి గురించి వర్మ ఎప్పుడు మాట్లాడిన.. ఆమెను ప్రేమించాడు.. ప్రేమించి పెళ్లి చేసుకుని భార్యగా చూసుకోవాలని ఉండటం కాదని, ఆమె తనకు దివి నుండి భువికి దిగివచ్చిన ఆరాధ్య దేవత అని అంటాడు వర్మ. నిజానికి వర్మ సినిమాల్లోకి రావడానికి కారణం కూడా శ్రీదేవి అనే చెప్తుంటాడు వర్మ.

 

అందుకే ఆమె అంటే రామ్ గోపాల్ వర్మకు ఎంతో ఇష్టం.. ఇక ఆమెతో తాను సినిమాలు చేసినన్ని రోజులు తన కన్నులకు పండుగేనని, అలానే కొన్ని షాట్స్ అయిపోయిన తరువాత కూడా ఆమెనే తదేకంగా చూస్తూ ఉండిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని వర్మ అంటుంటారు. ఇక ఆమె బోనిని పెళ్లి చేసుకున్నప్పుడు ప్రేమికుడిగా కొంత తనకు బాధ కలిగినప్పటికీ, ఆమె మంచినే ఎప్పుడూ కోరుకునే వాడినని వర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.. 

 

ఇప్పటికి ఎక్కడైనా ఎవరైనా ఇంటర్వ్యూలో శ్రీదేవి అని అన్నారు అంటే అయన కళ్ళలో ఓ ఆనందం కనిపిస్తుంది.. నిజంగా ఇప్పటివరకు చెప్పిన స్టోరీ అంత ఫెయిల్యూర్ లవ్ స్టోరీ.. ఒకవేళ రామ్ గోపాల్ వర్మ స్టోరీ హిట్ అయ్యి.. బోణి కపూర్ ని కాకుండా రామ్ గోపాల్ వర్మనే శ్రీదేవి పెళ్లి చేసుకొనినంటే? కథ ఎలా ఉండేది. 

 

రామ్ గోపాల్ వర్మ ఇంత బోల్డ్ గా ఉండేవాడు కాదు ఏమో.. మంచిగా ఉండేవాడు ఏమో.. ఓ స్టార్ డైరెక్టర్ అయ్యేవాడు ఏమో అని నెటిజన్లు తమ కామెంట్లలో ఫీలింగ్స్ ని చెప్తున్నారు.. ఏది ఏమైనప్పటికి ఓ అందాల రాణి ఈ వర్మకు భార్య అయ్యింటే అసలు ఎం అయ్యేదో మరి.. ఏది ఏమైనా రామ్ గోపాల్ వర్మ లవ్ స్టోరీ అంటే అంతే మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: