సినిమా పరిశ్రమలో వారసత్వం అనేది కామన్.. ఒక్క చిత్రపరిశ్రమలోనే కాదు ఏ ఫీల్డ్ లో అయినా వారసత్వం అనేది రెగ్యులర్ గా జరిగేదే.. సినిమాల విషయానికొస్తే స్టార్ హీరో కొడుకు స్టార అవ్వాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎంతో కష్టపడితే లక్ ఫ్యాక్టర్ కొంతమేరకు పనిచేస్తుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి వారసుడు రామ్ చరణ్ హీరోగా స్థిరపడ్డాడు. నాగార్జున తన ఇద్దరి తనయులు హీరోగా ఎంట్రీ ఇప్పించాడు. నాగ చైతన్య ట్రాక్ లోకి రాగా అఖిల్ హిట్టు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇక రావాల్సిన మరో వారసుడు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ. 

 

మోక్షజ్ఞ ఎంట్రీపై కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. హీరో అయ్యేందుకు మోక్షజ్ఞ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్నది ఇన్నర్ టాక్. ఇదిలాఉంటే ఒకప్పటి హీరో ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్న నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నందిని నర్సింగ్ హోమ్ సినిమా చేసిన ఈ యువ హీరో రీసెంట్ గా ఊరంతా అనుకుంటున్నారు సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరోగా రెండు సినిమాలు చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాకపోవడంతో నవీన్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నాడట. అందుకే ఈమధ్య తన ఫిజిక్ మీద దృష్టి పెట్టడం మానేసినట్టు తెలుస్తుంది.

 

లేటెస్ట్ గా నవీన్ పిక్స్ కొన్ని బయటకు వచ్చాయి. వాటిలో నవీన్ కొద్దిగా లావుగా మారినట్టు కనిపిస్తుంది. విజయ నిర్మల మరణంతో సినిమాలకు కొద్దిపాటి గ్యాప్ ఇచ్చిన నవీన్ సరైన డైట్ పాటించలేదని తెలుస్తుంది. ఇక హీరోగా నవీన్ కష్టమే అంటున్నారు ఈ పిక్ చూసిన వారు. అదేముంది మళ్ళీ సినిమా కోసం వర్క్ అవుట్స్ చేసి రెగ్యులర్ లుక్ తెచ్చుకోవడం ఎంతలోకి అనేయొచ్చు. కానీ కుర్రాడి వ్యవహారం చూస్తుంటే హీరోగా ఇక కొనసాగే మూడ్ లేదన్నట్టు అర్ధమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: