ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతా ‘బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్’ తో బిజీగా ఉంది. సందీప్ వంగా మొదలుపెట్టిన ఈ ఛాలెంజ్ ని చిరంజీవి వెంకటేష్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి సుకుమార్ కొరటాల శివ లతో పాటు అనేకమంది అనుసరించడంతో ఈ ఛాలెంజ్ లు ఈ లాక్ డౌన్ సమయంలో మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. 


ఇంట్లోని పాత్రలు కడగడం బట్టలు ఉతకడం వంట చేయడం లాంటి అనేక ఇంటి పనులు సెలెబ్రెటీలు చేయడం చూసి వారి అభిమానులు అంతా తెగ ఆనంద పడిపోతున్నారు. ఇప్పుడు ఈ కల్చర్ బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీని కూడ తాకడంతో అక్కడ కూడ సెలెబ్రెటీలు ఒకరికొకరు ఈ లాక్ డౌన్ సమయంలో సవాల్ విసురుకుంటున్నారు. ఇప్పుడు ఈవిషయాలు బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ దృష్టి వరకు వెళ్ళడంతో ఈ ఛాలెంజ్ లపై సల్మాన్ ఖాన్ సున్నితంగా సెటైర్లు వేసాడు. 


బాలీవుడ్ నటులు బాబా సిద్ధిఖి బాబా జీషాన్ అయూబ్ ఇద్దరూ కలిసి కరోనా క్రైసిస్ వల్ల ఇబ్బంది పడుతున్న 1,25,000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించారు.  ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ తన ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలుపుతూ ‘బాబా సిద్దిఖి జీషాన్ అయూబ్ ఎంతో గర్వంగా 1,25,000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు  అందించారు.  ఇది కదా ఎవరైనా పాల్గొనాల్సిన నిజమైన ఛాలెంజ్ అన్నదానం ఛాలెంజ్’ అంటూ ట్విట్ ద్వారా తన అభినందనలు తెలియచేస్తూ ఇలాంటి అన్నదానం ఛాలెంజ్ లను ఇండస్ట్రీలోని హీరోలు అంతా ఒకరికొకరు ఇచ్చుకుంటే బాగుంటుంది అనీ ఈ విషయమై బాలీవుడ్ హీరోలు దక్షిణాది హీరోలు దృష్టి పెడితే బాగుంటుంది అంటూ చురకలు అంటించాడు.


అంతేకాదు తనను ఎవరు నామినేట్ చేయకపోయినా తనకు తానే ఈ అన్న దానం ఛాలెంజ్ ని తీసుకుని ముంబాయిలో ఆకలితో అలమటించే అనేకమంది పేదలకు తాను అన్న దానం చేయబోతున్న విషయాన్ని వివరించాడు. దీనితో తెలుగు రాష్ట్రాలలో ఉండే సల్మాన్ ఖాన్ అభిమానులు రియల్ హీరో సల్మాన్ మాత్రమే అని అలాంటి ఆలోచనలు చేయకుండా ఇంట్లో కూర్చుని ఇండస్ట్రీ టాప్ హీరోలు వంటలు చేసుకుంటూ బట్టలు ఉతుకుతూ కాలం గడిపితే పెద ప్రజల కరోనా కష్టాలు తీరతాయా అంటూ సల్మాన్ అభిమానులు టాలీవుడ్ టాప్ హీరోల పై సెటైర్లు వేస్తున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: