క్రియేటివ్ సినిమాల దర్శకుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్న సుకుమార్ సినిమాలలో ఐటమ్ సాంగ్ కు చాల విపరీతమైన ప్రాముఖ్యత ఉంటుంది. తూర్పు గోదావరి జిల్లా ప్రాంతం నుండి సుకుమార్ రావడంతో ఒకప్పుడు అక్కడ స్వైరవిహారం చేసిన రికార్డింగ్ డాన్స్ ల కల్చర్ సుకుమార్ తీసే సినిమాలలోని ఐటమ్ సాంగ్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. 

 

గతంలో సుకుమార్ దర్శకత్వం వహించిన ‘ఆర్య’ సినిమాలో 'అ అంటే అమలాపురం' 'ఆర్య 2' సినిమాలో ‘రింగ రింగా’ ‘వన్ నేకోక్కడనే’ మూవీలోని ‘లండన్ బాబూ.. లండన్ బాబూ ‘రంగస్థలం’ మూవీలో ‘జిల్ జిల్ జిగేలు రాణి’ పాటలు ఆ సినిమాల ఘన విజయంలో ఎంతో కీలకంగా ప్రబావితం చేసాయి. సుకుమార్ దర్శకత్వం వహించిన ‘నాన్నకు ప్రేమతో’ మూవీలో తప్ప ప్రతి సినిమాలోని ఒక ఐటమ్ సాంగ్ ఉంది. 

 

ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సుకుమార్ బన్నీతో తీయబోతున్న ‘పుష్ప’ మూవీలో ఒక క్రేజీ ఐటమ్ సాంగ్ ఉండే విధంగా సుకుమార్ దేవీశ్రీప్రసాద్ తో ట్యూన్ చేయించినట్లు తెలుస్తోంది. ఈ ఐటమ్ సాంగ్ ట్యూన్ చాల బాగా రావడంతో ఈ పాటను ఒక క్రేజీ హీరోయిన్ పై తీయాలని సుకుమార్ భావిస్తున్నాడు. 

 

పాన్ ఇండియా లెవెల్ లో ఈమూవీని నిర్మిస్తూ అనేక భాషలలో విడుదల చేస్తున్న పరిస్థితులలో ఈ మూవీ బిజినెస్ ను దృష్టిలో పెట్టుకుని ఈ ఐటమ్ సాంగ్ లో నటింప చేయడానికి పూజాహెగ్డే - మలైకా అరోరా - జాక్వలిన్ ఫెర్నాండేజ్ - దిశా పటానీ లాంటి క్రేజీ హీరోయిన్స్ తో ప్రస్తుతం సుకుమార్ ఈ ఐటమ్ సాంగ్ విషయమై ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్లు టాక్.  అవసరం అనుకుంటే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి ఈ క్రేజీ బ్యూటీలలో ఎవరో ఒకరిని ఫిక్స్ చేయాలని ప్రయత్నిస్తున్నా ఇప్పుడు కరోనా వల్ల మూవీ బడ్జెట్ తగ్గించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అని సుకుమార్ రకరకాల ఆలోచనలలో ఉన్నట్లు టాక్..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: