నాని హీరోగా శివ నిర్వాణ డైరెక్షన్‌ లో తెరకెక్కుతున్న టక్ జగదీష్ సినిమా ని ఇప్పటి వరకూ పొల్లాచ్చి, సెకండ్ షెడ్యూల్ రాజమండ్రి లో ఫినిష్ చేశారు. ఆ తరవాత షెడ్యూల్ ని రాయలసీమ, కేరళ, వైజాగ్ లో  చేద్దామనుకున్నారు. కానీ ఇప్పుడప్పుడే అక్కడికి వెళ్లే ఛాన్స్ లేదు కాబట్టి.. లొకేషన్స్ రీ ప్లాన్ చేస్తోంది యూనిట్ . అఖిల్, పూజాహెగ్డే జంటగా వస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్  అమెరికాలో షూటింగ్ జరుపుకుంది. అయితే ఇంకో 10 రోజుల షూటింగ్  పార్ట్ అక్కడే షూటింగ్ చెయ్యాల్సి ఉంది.

 

కానీ ప్రజెంట్ ఎక్కడికీ వెళ్లే పరిస్తితి లేదు కాబట్టి.. ఈ ఫారెన్ షె డ్యూల్ ని క్యాన్సిల్ చేసేసి రామోజీ ఫిల్మ్ సిటీలో ఫ్లోర్ లోనే షూట్ కంప్లీట్ చేద్దామని ఫిక్స్ అయ్యాడట డైరెక్టర్ భాస్కర్. రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా  విరాటపర్వం . ఈ సినిమా కేరళలో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. మళ్లీ రాజమండ్రితో పాటు కేరళలోనే డీప్ ఫారెస్ట్ లో కొన్ని సీన్స్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. బట్.. ఇప్పుడు ప్లాన్ మార్చి కొత్త షెడ్యూల్ తయారుచేస్తున్నారు మేకర్స్.


  
నాగార్జున మూవీ వైల్డ్ డాగ్ టీం కూడా మరో లొకేషన్‌ కోసం వెతుకుతున్నారు. ఈ సినిమా షూట్ కోసం బ్యాంకాంక్ షెడ్యూల్ ప్లాన్ చేసింది యూనిట్. కానీ ప్రజెంట్ ఆ ఛాన్స్ లేకపోవడంతో ఆ ఫారెన్ షెద్యూల్ క్యాన్సిల్ చేసి స్టూడియో లోనే ఫినిష్ చేద్దామనుకుంటున్నారు.

 

వెంకటేష్ హీరోగా చేస్తున్న నారప్ప సినిమా మొన్నటి వరకూ తమిళ నాడు , తిరుచ్చిలో షెడ్యూల్స్ ఫినిష్ చేశారు. మిగిలిన షూట్ కూడా తమిళ నాడు లో డిఫరెంట్ ప్లేసెస్ ల ప్లాన్ చేసుకున్నాడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. బట్ ఇప్పుడు ఎందుకు రిస్క్ అనుకుంటూ రామానాయుడు స్టూడియోలోనే సినిమా షూట్ చేద్దామనుకుంటున్నారు .ఇలా స్టార్ హీరోలు , ప్లాన్స్ మార్చి.. ఇప్పుడు రీ ప్లాన్ చేసుకుంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: