ప్రజలు లాక్ డౌన్ సమయంలో పడుతున్న కష్టాలు చూసి రంగంలోకి దిగిన విజయ్ దేవరకొండ ప్రారంభించిన ఫండింగ్ కార్యక్రమాలు ఆదిలోనే తమ లక్ష్యాన్ని కోల్పోయిందా  అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో ఆదాయం లేనివారికి సహాయం చేస్తాను అంటూ విజయ్ దేవరకొండ ఇచ్చిన ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఇప్పటికే 77 వేలకు పైగా దరఖాస్తులు ఈ ఫండ్ కు రావడమే కాకుండా ఈ ఫండ్ కు అప్లయ్ చేసుకున్న చాలామంది పేద ప్రజలు కాదని చాలామంది విజయ్ దేవరకొండ అభిమానులు అని తెలుస్తోంది.  దీనితో తనకు వచ్చిన అప్లికేషన్స్ లో నిజంగా పేద ప్రజలు ఎవరు అని తెలుసుకునే కార్యక్రమం ఇప్పుడు విజయ్ దేవరకొండ టీమ్ చేపట్టినట్లు టాక్.


అప్లికేషన్స్ చాల ఎక్కువగా ఉండటంతో ఇప్పటి వరకు సహాయం కోసం వచ్చిన అభ్యర్ధనలలో కేవలం 2200 మందికి మాత్రమే ఇవ్వడం జరిగిందని అంటున్నారు. వాస్తవానికి విజయ్ దేవరకొండ ఫండ్ ఉద్దేశ్యాలలో ప్రధానంగా పేర్కొంటున్న 1000 రూపాయల సహాయం తీసుకునే వ్యక్తులు మిడిల్ క్లాస్ వ్యక్తులు ఎందుకు అవుతారు అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. 
 

ఇది ఇలా కొనసాగుతూ ఉంటే ఇక ఈ ఫండ్ కు నంచి సహాయం కోరుతూ అప్లికేషన్స్ తీసుకునే కార్యక్రమాన్ని ఆపు చేసి ప్రస్తుతం రెండు వేలమందికి మాత్రమే ఇవ్వాలి అనుకున్నా అంటూ విజయ్ దేవరకొండ ఇస్తున్న లీకుల పై విమర్శలు మరింతగా వస్తున్నాయి. కేవలం రెండు వేల మందికి సహాయం చేయాలి అని అనుకున్నప్పుడు విజయ్ దేవరొండ ఫండ్ ను ఒక అంతర్జాతీయ ఫండ్ లా ఎలివేట్ చేస్తూ మీడియాలో ప్రకటనలు ఎందుకు ఇచ్చారు అంటూ మరికొందరు జెక్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఫండ్ పై జరుగుతున్న నెగిటివ్ ప్రచారాన్ని గమనిస్తున్న వారు మాత్రం ఇది అంతా విజయ్ దేవరకొండ యాంటీ ఫ్యాన్స్ చేస్తున్న ప్రచారం అంటూ తీసిపడేస్తూ ఈ మాత్రం సహాయం కూడ చేయని వ్యక్తులు ఎందరో ఉన్నారు కదా అంటూ అభిప్రాయ పడుతున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: