తెలుగు చిత్ర పరిశ్రమలో ఆనాటి హీరోయిన్ ఈనాటి నిర్మాత మిల్కీ బ్యూటీ ఛార్మికి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు హీరోయిన్గా తన హాట్ హాట్ అందాలతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకర్షించి  ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత ఓ వైపు సినిమాల్లో ఐటెం సాంగ్స్ తో అదరగొడుతూనే  మరోవైపు నిర్మాతగా కూడా అవతారమెత్తి తన సత్తా చాటుతోంది. ఇదంతా ఎలా ఉన్నప్పటికీ టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న అంశం ఏది అంటే... ఛార్మి పూరి మధ్య ఉన్న రిలేషన్ షిప్ గురించి. ఎన్నో ఏళ్ల నుంచి వీరి మధ్య ఒక మంచి రిలేషన్ షిప్ కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. నటిగా మంచి గుర్తింపు ఉన్న ఛార్మికి స్టార్ డైరెక్టర్ గా ఉన్న పూరి కి మధ్య మంచి బాండింగ్  ఏర్పడింది. అది ప్రేమా...  స్నేహమా లేదా మరి ఇంకేదైనానా అనేది మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. 

 

 కానీ ఒకప్పటి హాట్ హీరోయిన్ ఇప్పటి నిర్మాత అయిన ఛార్మి మాత్రం పూరి జగన్నాథ్ ను అమితంగా అభిమానిస్తూ ఉంటుంది. పూరి జగన్నాథ్ గురించి ఎప్పుడు మాట్లాడినా ఎంతో గొప్పగా చెబుతూ ఉంటుంది ఛార్మి. అసలు వీరి ఇద్దరి మధ్య అనుబంధం ఎలా ఏర్పడింది అనేది కూడా చాలా మంది ప్రేక్షకులకు తెలియదు. కానీ ప్రస్తుతం వీరిద్దరూ ఎక్కడ చూసినా ఒకేచోట కనిపిస్తూ ఉంటారు. ఇక ఇద్దరూ కలిసి నిర్మించిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. దీంతో ఇద్దరి అంశమే టాలీవుడ్ లో చాలా సార్లు హాట్ టాపిక్ గా మారిపోయింది. 

 

 ఏదైనా ఈవెంట్లు పూరి జగన్నాథ్ ఉన్నాడు అంటే పక్కనే తప్పకుండా ఛార్మి ఉంటుంది. అదేంటోగాని వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ గురించి చాలామందికి ఇప్పటికీ మనసులో ఓ  ప్రశ్న మెదులుతూనే ఉంటుంది. కొంతమంది ఈ ఇద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నారు అని అంటుంటే.. ఇంకొంతమంది వీరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ మాత్రమే ఉంది అని అంటుంటారు. మరికొంతమంది ఇద్దరు పెళ్లి కూడా చేసుకుంటారు అంటూ వాళ్ళ అభిప్రాయం చెబుతూ ఉంటారు. ఏదేమైనా వీరిద్దరి మధ్య  మాత్రం ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ అనుబంధం ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: