తెలుగు తమిళ కన్నడ భాషల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నయనతార. ప్రస్తుతం అన్ని భాషల్లో లేడీ సూపర్ స్టార్ గా దూసుకుపోతుంది ఈ అమ్మడు. ఈ అమ్మడు ఇండస్ట్రీకి  ఎంట్రి ఇచ్చి దశాబ్ద కాలం గడిచిపోతున్నప్పటికీ ఈ అమ్మడికి రోజురోజుకు క్రేజ్  పెరిగిపోతోంది కానీ ఎక్కడ తగ్గడం లేదు. ఈ హీరోయిన్ కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోల సరసన కూడా నటించింది. దాదాపుగా అందరి హీరోల సరసన నటించింది  ఈ ముద్దుగుమ్మ. అటు తెలుగు తమిళ కన్నడ సినిమాల్లో కూడా ఎన్నో సినిమాల్లో నటించింది.. మొదట్లో ఎన్నో గ్లామర్ పాత్రల్లో నటించి తనదైన అందాల ఆరబోతతో ఎంతో మంది ప్రేక్షకుల మతి పోగొట్టింది ఈ ముద్దుగుమ్మ. 

 

 

 ఇక ఇప్పుడు అందాల ఆరబోతకు దూరంగా ఉంటూ కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు మాత్రమే చేసుకుంటూ పోతుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా దర్శకనిర్మాతలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. అయితే ఈ అమ్మడు సినిమాలతో ఎంత హాట్ టాపిక్ గా మారుతోందో  ఈ అమ్మడి లవ్ ఎఫైర్స్ తో కూడా ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతుంది. ఎందుకంటే చిత్ర పరిశ్రమలో బాగా పేరున్న వ్యక్తులతో  ప్రేమాయణం  నడిపిస్తుంది ఈ అమ్మడు. మొదట దర్శకుడు హీరో శింబుతో ప్రేమాయణం నడిపింది ఆ తర్వాత బ్రేకప్ అయింది. ఇక ఆ తర్వాత ఇండియన్ మైఖేల్ జాక్సన్ దర్శకుడు డాన్సర్ నటుడు అయిన ప్రభుదేవా తో ఎన్నో రోజుల పాటు ప్రేమాయణం నడిపింది. 

 

 

 ఎక్కడ చూసినా ఈ ప్రేమజంట కనిపించేది. వీరి ప్రేమాయణం ఎంతగా డీప్ గా వెళ్లి పోయింది అంటే నయనతార ఏకంగా తన చేతిపై ప్రభుదేవా అని కూడా టాటూ వేయించుకునెంతగా  డీప్ గా  వెళ్ళిపోయింది వీరి రిలేషన్ షిప్. ఆ తర్వాత వీరిద్దరూ ఇంకొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు అనుకుంటున్న తరుణంలో... ఏమైందో తెలియదు కానీ వీరిద్దరికీ బ్రేకప్ ఐపోయింది. దీంతో నయనతార తన చేతిపై ఉన్న ప్రభుదేవా టాటూ  కూడా తొలగించుకుంది . ఆ తర్వాత ఈ అమ్మడు లవ్ జోలికి వెళ్లకుండా సైలెంట్ గా ఉంది అనుకుంటున్నారా అలా అనుకుంటే పొరపాటే. దర్శకుడు విగ్నేషన్  తో ప్రేమాయణం మొదలు పెట్టింది. ప్రస్తుతం ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది.మరి ఇది ఎక్కడికి  దారితీస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: