తమిళ స్టార్ హీరో తల అజిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వలిమై. ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం రెండు కీలక షెడ్యూల్ లను కూడా కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ చిత్రంలో టాలీవుడ్ యువ నటుడు నవదీప్ కీలక పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలు నవదీప్ దాక చేరడం తో తాజాగా అతను క్లారిటీ ఇచ్చాడు. అవ్వన్నీ గాలి వార్తలు  ఆసినిమాలో నేను నటించడం లేదని సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు. ఇక ఈ రోజు అజిత్ తన పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ,సెలబ్రెటీలు అజిత్ కు  విషెష్ తెలియజేస్తున్నారు. నవదీప్ కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా అజిత్ ను విష్ చేశాడు. అయితే అజిత్ బర్త్ డే  సందర్భంగా వలిమై నుండి అప్డేట్ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. కరోనా వల్ల  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా నిలిచిపోవడంతో అప్డేట్ ఇవ్వలేమని మేకర్స్ తెలియజేశారు. 
 
 
ఖాకి ఫేమ్ వినోత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అజిత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్నఈ చిత్రంలో అజిత్ సరసన హ్యూమా ఖురేషి నటిస్తుండగా  ప్రముఖ బాలీవుడ్  నిర్మాత  బోనీ కపూర్సినిమా ను నిర్మిస్తున్నాడు. ఈదీపావళికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా అజిత్ , వినోత్ , బోనీ కాంబినేషన్ లో ఇది రెండో సినిమా. ఇంతకుముందు వీరికలయికలో పింక్ రీమేక్ తెరకెక్కగా గత ఏడాది విడుదలైన ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: