ప్రస్తుతం కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగిస్తున్న  విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎంతో మంది నిరుపేదలు ఉపాధి  కోల్పోయి తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వలస వచ్చిన చాలా మంది కార్మికులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ఎవరైనా సహాయం చేసి కడుపు నింపుతే బాగుండు  అని ఆశగా ఎదురు చూస్తున్నారు.అయితే ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చాలా మంది నిరుపేదలకు సహాయం చేయడానికి ఎంతో మంది ప్రముఖులు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ యువ హీరో అయిన విజయ్ దేవరకొండ తన పెద్ద మనసు చేసుకొని పేద ప్రజలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. 

 

 

 లాక్ డౌన్  సమయంలో కనీసం నిత్యావసరాలు కూడా దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సహాయం చేయడానికి దేవరకొండ ట్రస్టు ద్వారా చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఎన్నో కుటుంబాలకు సహాయం అందించారు విజయ్ దేవరకొండ. ఇక యువహీరో అయినప్పటికీ ఎంతో మంది నిరుపేదలకు దేవరకొండ ట్రస్టు ద్వారా సహాయం చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ సేవలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. దేవరకొండ ఫౌండేషన్ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న కారణంగా... నిరుపేదలకు సహాయం చేయలేక పోతున్నాము అంటూ విజయ్ దేవరకొండ తెలిపారు. 

 

 

 మేము రెండు వేల కంటే ఎక్కువ కుటుంబాలకు హెల్ప్ చేయడానికి ఫండ్ ఏర్పాటు చేసుకున్నమని... ఈరోజు మేము ఏర్పాటు చేసుకున్న గోల్ రీచ్ అయ్యాము  అంటూ విజయ్ దేవరకొండ తెలిపారు. దేవరకొండ ట్రస్ట్ కి చాలానే డొనేషన్స్ వచ్చాయని మొత్తం ఆరు వేల ఫ్యామిలీలకు హెల్ప్ చేయడానికి తగినంత డొనేషన్స్ తమ వద్ద ఉన్నాయి అంటూ విజయ్ దేవరకొండ తెలిపారు. కానీ గత ఐదు రోజుల్లో  సహాయం కావాలి అంటూ ఏకంగా  77 వేల విజ్ఞప్తులను వచ్చాయని... కానీ తమ వద్ద ఉన్న ఫండ్ అంత మందికి సహాయం చేయడానికి సరిపోదు అంటూ తెలిపారు. అందుకే కొత్తగా వచ్చిన రిక్వెస్ట్ లకు మేము సహాయం చేయడం ఆపేస్తామని... ప్రస్తుతం ఉన్న రిక్వెస్ట్ లకు మాత్రమే సహాయం చేయడానికి తమ వద్ద ఉన్న ఫండ్  సరిపోతుంది అంటూ విజయ్ దేవరకొండ తెలిపారు. పేదలకు మరింత సహాయం చేయడానికి డొనేట్ చేయడానికి ప్రముఖులు ముందుకు రావాలని...ఇలాంటి  క్లిష్ట పరిస్థితుల్లో అందరూ పేదలకు చేయూతనివ్వాలి అంటూ విజయ్ దేవరకొండ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: