తెలుగు బుల్లితెర మీద ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేసేందుకు ఎన్ని ఛానెల్స్ ఉన్నా జెమినీ ఛానెల్‌కు ఉన్న క్రేజే వేరు. ప్రేక్ష‌కుల‌ను కొత్త కొత్త సినిమాలు, మంచి సీరియ‌ల్స్‌తో ఎంట‌ర్టైన్ చేసేందుకు జెమినీ ఛానెల్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. కొత్త సినిమాల‌ను త్వ‌ర‌గా బుల్లితెర మీద ప్ర‌సారం చేసే ట్రెండ్‌ను జెమినీ ఛానెలే ముందుగా ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. కొత్త సినిమాల శాటిలైట్ రైట్స్‌ను కోట్లాది రూపాయ‌ల‌కు కొనుగోలు చేసి ప్ర‌సారం చేయ‌డం ద్వారానే జెమెనీ ఛానెల్ క్రేజ్ పెర‌గ‌డంతో పాటు త‌మ రేటింగ్ కూడా పెంచుకుంది.

 

అయితే మ‌ధ్య‌లో మా టీవీ నుంచి వ‌చ్చిన పోటీతో జెమినీ ఛానెల్ టాప్ రేటింగ్‌లో వెన‌క‌ప‌డిపోయింది. ఇక చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ టాప్ వ్యూవ‌ర్ షిఫ్‌తో జెమ‌నీ ఛానెల్ మ‌ళ్లీ టాప్ ప్లేసులోకి వ‌చ్చింది. గత వారం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో జెమినీ ఛానెల్ కు 5 లక్షల 39 వేలకు పైగా ఇంప్రెషన్స్ రాగా ఆ త‌ర్వాత రెండో ప్లేస్‌లో ఉన్న స్టార్ మా ఛానెల్‌కు 5 ల‌క్ష‌ల ఇంప్రెష‌న్స్ వ‌చ్చాయి. ఇక మూడో స్థానంలో ఉన్న ఈటీవీ  4 లక్షల 75 వేల ఇంప్రెష‌న్స్ తెచ్చుకుని త‌న స్తానిన్ని ప‌దిల ప‌ర‌చుకుంది.

 

ఇక జీ తెలుగు మరియు జెమినీ మూవీస్ ఛానెల్ లు నాలుగు ఐదు స్థానాల్లో నిలిచాయి. ఇలా మొత్తానికి మాత్రం చాన్నాళ్లకు జెమినీ ఛానెల్ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఈటీవీ స‌రికొత్త ప్ర‌యోగాలు చేయ‌క‌పోయినా పాత సినిమాల‌తో పాటు త‌న టాప్ షోల‌తోనే భారీ స్థాయిలో ఇంప్రెష‌న్స్ తెచ్చుకుంటోంది. గ‌త నాలుగైదు ద‌శాబ్దాల హిట్ సినిమాలు అన్ని ఇప్పుడు ఈటీవీలో ప్ర‌సార‌మ‌వుతున్నాయి. వీటిని ఎంజాయ్ చేస్తోన్న సీనియ‌ర్ సిటిజ‌న్లు, మ‌హిళ‌లు ఎక్కువుగా ఈటీవీ చూస్తుండ‌డంతో ఈటీవీ రేటింగ్ కూడా ఎక్క‌వ‌గానే ఉంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: